29.7 C
Hyderabad
May 2, 2024 04: 34 AM
Slider తూర్పుగోదావరి

కృష్ణాష్టమికి గోపాలుడి తోపాటు గోవులను పూజిస్తే సకల పాపాలు పోతాయి

#alamurutemple

కృష్ణాష్టమి రోజున కేవలం భగవానుని పూజించడమే కాదు. ఆ గోపాలనీ తోపాటు గోవులను అర్చిస్తే సకలపాపాలు పోతాయని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు పి ముకుందేశ్వర స్వామి అన్నారు. మండల కేంద్రమైన  ఆలమూరు రామాలయం వద్ద శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్బంగా కోలాటం భక్తులు ఏర్పాటు చేసిన గోమాత పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కృష్ణ భగవానునిలోని మంచి లక్షణాలని అలవర్చుకుని ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలన్నారు. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడని ఆయన చేసిన అన్ని లీలలోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయన్నారు.

ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడని కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోయి  ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని పురాణం చెబుతుందన్నారు. అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే.. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారని అన్నారు అనంతరం రామాలయంలో కోలాటం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించగాగా, పశు సంపదకు ప్రధాన కేంద్రమైన గుమ్మిలేరులో మహిళా భక్తులు గోమాతకు పూజలు నిర్వహించారు.

Related posts

మంత్రి సీతక్కకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు

Satyam NEWS

కోమటిరెడ్డితో పొంగులేటి చర్చలు

Bhavani

డేంజర్ బట్ న్యూవే:మలద్వారంలో దాచి బంగారం రవాణా

Satyam NEWS

Leave a Comment