31.7 C
Hyderabad
May 7, 2024 01: 24 AM
Slider ఖమ్మం

నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం

#prtu

నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని, ప్రయివేటు స్కూల్ బంద్ అయి పిల్లలు అందరూ సర్కార్ స్కూళ్లకు వచ్చే విధంగా సకల వసతులు కల్పిస్తున్నామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.  ఖమ్మం జిల్లా కేంద్రం లో పిఅర్ టియు ఖమ్మం జిల్లా శాఖ అధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  పువ్వాడ మాట్లాడుతూ  పిఅర్ టియు కి ప్రభుత్వంకు పేగు బంధం పెనవేసుకుందన్నరు. ఉపాధ్యాయులు ప్రభుత్వం అందిస్తున్న విద్యను ప్రతి సామాన్యుడి చేరే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడికి నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,289 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మన ఊరు- మన బడి / మన బస్తీ-మన బడిని చేపట్టిందని అందులో భాగస్వాములు కావాలన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేసి అన్ని మౌళిక వసతుల కల్పన చేస్తున్నట్లు ఆయన అన్నారు.

మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 సర్కార్ బడులలో రూ.7,289 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని, ఒకవైపు బోధన, మరోవైపు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నామని ఉపాద్యాయులు ప్రభుత్వంకు తమ సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, పిల్లలు పుస్తక పఠనంతో పాటు నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్  విద్య పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధిని మనందరం కలిసికట్టుగా నిలబడి మన వంతు సహకారం అందించాలని అన్నారు. ఈ హాల్ శంకుస్థాపన చేసుకున్నాం అంటే అది కెటిఆర్ కృషి ఫలితమేనని ఉపాధ్యాయుల తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, మేయర్ పునుకొల్లు నీరజ,  చైర్మన్ కమల్ రాజ్, మాజి ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజి ఎమ్మేల్యే బానోత్ చంద్రావతి, పిఅర్ టియు రాష్ట్ర నాయకులు శ్రిపాల్ రెడ్డి గారు, జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శి మోతుకురి మధు,  రంగారావు, విజయ్ అమృత్ కుమార్, రెబ్బా శ్రీను, కట్టా శేఖర్ తదితరులు ఉన్నారు.

Related posts

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు

Satyam NEWS

హై హాండెడ్ నెస్: దివీస్ కంపెనీ దౌర్జన్యం పై మంత్రికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment