24.7 C
Hyderabad
March 26, 2025 09: 09 AM
Slider ఖమ్మం

సైఫ్ ను కఠినంగా శిక్షించాలి

#cpi

 డాక్టర్ ప్రీతి మరణానికి కారణం అయిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, రాష్ట్రవ్యాప్తంగా పెట్రేగిపోతున్న ర్యాగింగ్ ను అరికట్టాలని యన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి,  ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ  డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం బైపాస్ రోడ్డుపై సైఫ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ ను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ జరుగుతుందని కంప్లైంట్ చేసిన స్పందించని ప్రిన్సిపల్ , హెచ్.ఓ.డి లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ర్యాగింగ్ పేట్రేగిపోతుందని దీనిని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే విధించే శిక్షల పట్ల విద్యార్థుల అవగాహన పెంచి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల మధ్య సీనియర్ జూనియర్ అనే  విభేదాలను పక్కనపెట్టి చదువుల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు వేసి ర్యాగింగ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ర్యాగింగ్ విష సంస్కృతికి వ్యతిరేకంగా యన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ, ఏఐవైఎఫ్ సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మహిళలపై దాడులు, హత్యాచారాలు, అవమానకర సంఘటనలు జరుగుతున్నాయని వీటికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రీతి మరణంతో ప్రభుత్వాలు కండ్లు తెరవాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణ కుమార్, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, మహిళా సంఘం నాయకురాలు పోటు మమత, ఏఐవైఎఫ్ ఆర్గనైజేషన్ కార్యదర్శి మద్దోజు శ్రావణ కుమార్, ఖానాపూరం సిపిఐ కౌన్సిల్ సభ్యులు మడిశెట్టి ఓంప్రకాష్, నరేష్, చంటి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

హైలీ పెయిడ్: మనవాడైతే చాలు గడ్డ పెరుగు వడ్డించేయ్

Satyam NEWS

దేశ వ్యాప్తంగా 36,011 క‌రోనా కేసులు న‌మోదు

Sub Editor

Leave a Comment