38.2 C
Hyderabad
April 29, 2024 11: 32 AM
Slider వరంగల్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు

#MuluguCollector

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని రహదారుల్లో ప్రమాద స్థలాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఇప్పటికే గుర్తించిన వాటి వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

చర్యలు చేపట్టక ముందు, తర్వాత ఫోటోగ్రాఫ్ చేయాలన్నారు. ఓవర్ లోడ్, లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం పై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

అనుమతి లేకుండా స్పీడ్ బ్రేకర్లు వద్దు

గత మూడు సంవత్సరాలుగా ఎన్ని ప్రమాదాలు జరిగింది, ఎంత మంది ప్రాణాలు కోల్పోయింది నివేదిక సమర్పించాలన్నారు. అనుమతి లేకుండా రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఉన్నచోట గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలో 14 వైన్ షాపులు ఉన్నట్లు, ప్రతి వైన్ షాపుకు ఇరువైపులా 100 మీటర్ల పరిధిలో ఖాళీ స్థలాలతో సహా కవర్ అయ్యేలా సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, వైన్ కొనుగోలుకు వచ్చే వారు హెల్మెట్, మాస్క్ ఖచ్చితంగా ధరించేలా చూడాలని, లేని వారికి మద్యం అమ్మకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు

పర్యాటక ప్రదేశాలు లక్నవరం, రామప్ప, బోగత దగ్గర పార్కింగ్ చేయకూడని ప్రదేశాల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గట్టమ్మ దేవాలయం నుండి మల్లంపల్లి వరకు రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు చెట్లు పొదలు తొలగించాలని, అదే విధంగా జిల్లాలోని అన్ని రహదారుల కిరువైపుల పొదలు తొలగించాలని అన్నారు.

ఆర్టీసీ బస్సులు రాష్ డ్రైవింగ్ లేకుండా జాగ్రత్తగా నడిపేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. జిల్లాలోని అన్ని బస్ స్టాండ్ లలో టాయిలెట్లు ఉండాలన్నారు.

పాఠశాలలు ప్రారంభం అయితే అట్టి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా పాఠశాలల వద్ద స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ, మేడారం రహదారికి బ్లాక్ స్పాట్స్, ప్రమాదాలు జరిగే ప్రదేశాల వివరాలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు, వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు, హెల్మెట్ లేనిది అనుమతించడం లేదని తెలిపారు. రహదారి వెంట కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి, హెల్మెట్, సీట్ బెల్ట్, రాష్ డ్రైవింగ్ తదితరాలు గుర్తించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, ములుగు ఎఎస్పీ సాయి చైతన్య, జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, ఇఇ ఆర్ అండ్ బి వెంకటేష్, ఇఇ పీఆర్ రాంబాబు, ఆర్టీసీ డిఎం భాను కిరణ్, ఏఎంవిఐ రాజశేఖర్, ఎక్సైజ్ సిఐ సుధాకర్, ఎన్ హెచ్ ఎఇ కె. బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

Satyam NEWS

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి

Satyam NEWS

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు

Bhavani

Leave a Comment