31.2 C
Hyderabad
May 3, 2024 02: 39 AM
Slider సినిమా

క్వశ్చన్ అవర్: కరీనా కపూర్ కొడుకు పేరు ఏమిటి?

#karinakapoor

మహనీయులు, మహాత్ములు పోయారు… స్వాంతంత్ర్య సమరయోధులు వారి త్యాగాలు పోయాయి… భారతం భాగవతం రామాయణం పోయాయి… ఇప్పుడు పిల్లలకు నేర్పుతున్నది ఏమిటంటే కరీనా కపూర్ మొగుడి పేరు ఏమిటి? కరీనా కపూర్ కొడుకు పేరు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు….. ఛ ఛ విద్యావ్యవస్థ ఇంత దిగజారిపోయిందా? అని ఆశ్చర్యపోవద్దు. నిజంగానే విద్యావ్యవస్థ దిగజారిపోయింది. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలోని ఒక ప్రయివేటు స్కూలు వారు ఆరో తరగతి విద్యార్ధులకు టరమ్ పరీక్షలో వేసిన ప్రశ్న చూస్తే మతి పోతుంది. సినిమా యాక్టర్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ అనే మరో సినీ నటుడిని పెళ్లి చేసుకున్నది. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆ కొడుకు పూర్తి పేరు ఏమిటి అనేది ఆరో తరగతి విద్యార్ధులకు ఇచ్చిన ప్రశ్న. ఆ పిల్లాడి పేరు తైమూర్ అలీఖాన్ అట. ఇదా విద్యార్ధులు తెలుసుకోవాల్సింది? ఇదే విషయాన్ని ఆ స్కూల్ విద్యార్ధుల తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అధికారులు ఆ స్కూల్ కు నోటీసులు ఇచ్చారు.

Related posts

పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలి

Satyam NEWS

విజయనగరం జిల్లాలో బాల్య వివాహాల పై ప్రత్యేక డ్రైవ్

Satyam NEWS

విజయనగరం జిల్లాలో విధులకు గైర్హాజరైన ఇద్దరు వైద్యులు…

Satyam NEWS

Leave a Comment