34.2 C
Hyderabad
May 11, 2024 19: 20 PM
Slider ఆధ్యాత్మికం

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

#TTD

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం  ఉదయం  6 గం నుంచి 8 గం వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.43 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం          ఉదయం         9 గం నుంచి 10 వరకు

గరుడ వాహనం              ఉదయం         11 గం నుంచి 12 వరకు

హనుమంత వాహనం     మధ్యాహ్నం   1 గం నుంచి 2 వరకు

చక్రస్నానం                   మధ్యాహ్నం     2 నుంచి 3 వరకు (రంగనాయకుల మండపంలో)

కల్పవృక్ష వాహనం         సాయంత్రం   4 నుంచి 5 వరకు

సర్వభూపాల వాహనం    సాయంత్రం   6 గం నుంచి 7 వరకు

చంద్రప్రభ వాహనం        రాత్రి                 8 గం నుంచి 9 వరకు

ఆర్జిత సేవలు రద్దు

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి

ఫిబ్రవరి 8వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ర‌థస‌ప్త‌మి ఏకాంతంగా జ‌రుగ‌నుంది. ఆల‌యం వ‌ద్ద గ‌ల వాహ‌న‌మండ‌పంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

సూర్యప్రభ వాహనం       ఉదయం       7 గం నుంచి 7.30 వరకు

హంస‌ వాహనం             ఉదయం        8 గం నుంచి 8.30 వరకు

అశ్వ‌ వాహనం             ఉదయం        9 గం నుంచి 9.30 వరకు

గరుడ వాహనం              ఉదయం         9. గం నుంచి 10 వరకు

చిన్న‌శేష వాహనం        ఉదయం        10 గం నుంచి 10.30 వరకు

స్న‌ప‌న‌తిరుమంజ‌నం       మధ్యాహ్నం     3 నుంచి 4.30 వరకు (శ్రీకృష్ణ ముఖ మండపంలో)

చంద్రప్రభ వాహనం        సాయంత్రం     6. గం నుంచి 6.30 వరకు

గ‌జ వాహనం                    రాత్రి                  7.30 గం నుంచి 8 వరకు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

Related posts

విక‌లాంగుల‌కు పించ‌న్ కోసం విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ ధర్నా

Satyam NEWS

సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా సైబర్ క్రైం యూనిట్స్

Satyam NEWS

శాల్యూట్: బెణికింది కాలు మాత్రమే మనసు కాదు

Satyam NEWS

Leave a Comment