29.7 C
Hyderabad
April 29, 2024 09: 48 AM
Slider విజయనగరం

లేడీ బాస్: ప‌నితీరుతో సిబ్బందికి వ‌ణుకు పుట్టిస్తున్న విజయనగరం ఎస్పీ

#deepika

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని చెప్ప‌డం వేరు….స్వ‌యంగా రంగంలోకి దిగి  మేన్యువ‌ల్ కు విరుద్దంగా ప‌ని చేస్తున్న‌ సిబ్బందిని తాట‌తీయ‌డం వేరు.స‌రిగ్గా ఈ రెండో ప‌ద్ద‌తినే విజ‌య‌న‌గ‌రం  జిల్లాకు లేడీ పోలీస్ బాస్ గా వచ్చిన దీపికా ఎం పాటిల్ అవ‌లంబిస్తున్న‌ట్టు ప‌రిస్థితులు గోచ‌రిస్తున్నాయి. 

దిశ విభాగ‌పు పోలీస్ అధికారిగా ఉన్న దీపిక‌…ర‌మార‌మి ఆరు నెల‌ల క్రితం అంటే గతేడాది జిల్లాకు ఎస్పీ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌తంలో పార్వ‌తీపురం ఓఎస్డీ గాప‌నిచేసే అనుభ‌వంతో జిల్లాకు కొత్త కాక‌పోయినా… ఏకంగా ఈ సారి పోలీస్ శాఖ‌కే బాస్ గావ‌చ్చి…ఆరు నెల‌లోనే త‌న‌దైన ముద్ర వేసారు…పోలీస్ బాస్ ఎస్పీ దీపికా.

భ‌ర్త  విక్రాంత్ పాటిల్…అయిదవ బెటాలియ‌న్ క‌మాండెంటెండ్ గా రావ‌డం….ఎస్పీగా దీపికా జిల్లాకు రావ‌డం ఇద్ద‌రూ ఒకేసారి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం విశేషం. బాధ్య‌త‌లు తీసుకున్న అనంర‌తం…ఆక‌స్మిక త‌నిఖీల‌తో తానేంటో…త‌న ప‌ని తీరు ఏంటో అటు  డీఎస్పీ స్థాయి అధికారుల‌కు ఇటు ఇన్ :స్పెక్ట‌ర్లకు మ‌రోవైపు స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ల‌కు ప్ర‌త్య‌క్షంగా చూపించారు….పోలీస్ బాస్ దీపిక‌.

ఏదైనా పోలీస్ బాస్ ల ప‌నితీరు…చార్జ్ తీసుకున్న వెంట‌నే కొంద‌రు…బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఇంకొంద‌రి ప‌నితీరు క‌నిపిస్తుంది.స‌రిగ్గా ఈ రెండో కోవ‌కే ప్ర‌స్తుత ఎస్పీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా శాఖ లో  ఓ  సిబ్బంది…ఏఆర్ ఇన్ స్పెక్ట‌ర్ సెల‌వులోఉండ‌గానే దాదాపు…250మంది హోం గార్డుల ఐడీ కార్డుల‌ను స‌ద‌రు ఇన్ స్పెక్ట‌ర్ అనుమ‌తి లేకుండా ముద్రించి…వాళ్ల వ‌ద్ద నుంచీ డ‌బ్బులు తీసుకున్న‌ట్టు… తీరా స‌ద‌రు ఏఆర్ ఇన్ స్పెక్ట‌ర్..ప్ర‌తీ మంగ‌ళ‌వారం జ‌రిగే హోం గార్డుల ప‌రేడ్ లో…ఫోర్జ‌రీ య‌వ్వారం బ‌య‌ట‌ప‌డ‌టం…విష‌యం కాస్త‌…పోలీస్ బాస్ చెవిలోప‌డ‌టం…హుటాహుటి సస్పండ్ చేయ‌డం..వెంట‌నే రివోక్ చేయ‌డం …అన్ని చ‌కచ‌క‌గా జ‌రిగిపోయాయి.

ఈ అంశంతో  లేడీ పోలీస్ బాస్ ప‌నితీరు ఏంటో..మొత్తం శాఖ కు అర్ధ‌మైంది. అయితే  2019 లో ఎస్పీ గా  వ‌చ్చిన రాజ‌కుమారి…సిబ్బంది ప‌నితీరుపై కాస్త నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికీ…వారంతా క‌రోనా స‌మ‌యంలో చేసిన సేవ‌ల‌కు ద‌గ్గ‌రుండీ క్యాష్ అవార్డుల‌ను ప్ర‌క‌టించి త‌ద్వారా  ఎప్పీ రాజ‌కుమారీ సిబ్బందికి ఫేవ‌ర్ అని అనిపించుకున్నారు.

అయితే క‌రోనా స‌మ‌యంలో అర్ధ‌రాత్రి వ‌ల‌స కుటుంబాల‌ను ఆదుకోవ‌డంతో స్ర్కాచ్ అవార్డల‌ను కేంద్ర మంత్రి చేతులుమీదుగా తీసుకుని… డీఐజీ    గా ప‌దోన్న‌తి పోందారు.కానీ ప్ర‌స్తుతం ఉన్న లేడీ పోలీస్ బాస్…సిబ్బంది  ప‌నితీరుప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తున్న‌ట్టు ప‌రిస్థితులు  కనిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.చూద్దాం….ఈ లేడీ పోలీస్ బాస్…ఇంకెలాంటి  క‌ఠిన మైన నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలంటోంది..స‌త్యం న్యూస్.నెట్

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

ఆధార్ మార్పులు చేర్పులు ఇక గ్రామ సచివాలయాల్లోనే

Satyam NEWS

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలించరాదని భాజపా నిరసన

Satyam NEWS

సీఎం జగన్ నిరుద్యోగుల ద్రోహి.. జాబ్ క్యాలెండర్ కోసం అంబేద్కర్ కు వినతిపత్రం..!

Satyam NEWS

Leave a Comment