40.2 C
Hyderabad
May 6, 2024 18: 23 PM
Slider కడప

శాల్యూట్: బెణికింది కాలు మాత్రమే మనసు కాదు

Rajampet CI

విధినిర్వహణలో కాలు ఫ్రాక్చర్ అయింది. అతని సంకల్పం కాదు. అందుకే బెణికిన కాలు పూర్తిగా నయం కాకున్నా కోవిడ్-19 వీధుల్లో కి చేరి తోటి ఉద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు రాజంపేట టౌన్ సిఐ శుభకుమార్. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని టౌన్ సీఐ శుభకుమార్ కోవిడ్ -19 లాక్ డౌన్ కర్ఫ్యూ విధినిర్వహణలో గత నెల 26 వతేది  రాత్రి కవాతు నిర్వహిస్తుండగా, గుంతలో కాలు పడటంతో కాలు బెణికింది.

పోలీస్ సిబ్బంది పట్టణంలోని జగన్ మోహన్ హాస్పిటల్ కు తీసుకుపోగా వైద్యులు ఎక్సరే తీసి  కాలు ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించి వైద్యం చేసి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీనితో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోగా తగు జాగ్రత్త లు తీసు కోవాలని స్వయంగా ఎస్పీ పరామర్శించి పలు సూచనలు చేశారు.

కొద్ది రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నా పూర్తిగా నయం కాకపోవడంతో ఈనెల 14నుంచి తిరిగి డ్యూటీ లోకి చేరారు. పట్టణంలో ని ముఖ్య కూడలిలో అలాగే వాకర్ తో కర్ఫ్యూ లో తిరుగుతూ రోడ్డు పైకి వచ్చే వారికి హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే ఆకలితో అలమటించే పేదలకు దాతల సహాయంతో నిత్యావసర వస్తువులను ఆయనే స్వయంగా వారి గుడిసెల వద్దకు వెళ్లి అందజేశారు. కాలు నెప్పి పుటిస్తున్నా, తోటి ఉద్యోగులు వారిస్తున్నా లెక్క చేయకుండా, తోటి ఖాకి సోదరులు కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు రాత్రింబవళ్లు కష్ట పడుతుండడం తో ఆయన కూడా ,విధుల్లోకి జాయిన్ అయ్యారు.

Related posts

మాఫియాల్లో కలిసి పోతున్న పోలీసులు: ఆనం వ్యాఖ్య

Satyam NEWS

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

Sub Editor

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా త్వరలో పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment