30.2 C
Hyderabad
May 13, 2024 12: 20 PM
Slider ప్రత్యేకం

జగన్ కు లేఖ రాయండి: డ్రాఫ్ట్ లెటర్ ఇచ్చిన రఘురామ

#raghurama

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధం హామీని అమలు చేయాలని కోరుతూ ఆయనకు ఒక లేఖ రాయాలని వైసీపీ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు మహిళలకు పిలుపునిచ్చారు. ఈ లేఖను ఇంటికి వచ్చే వాలంటీర్ కు గానీ, ఎమ్మెల్యే కు గానీ సంతకం పెట్టి మరీ అందచేయాలని ఆయన కోరారు.

మహిళలు సీఎం జగన్ కు రాయాల్సిన లేఖ డ్రాఫ్టును రఘురామకృష్ణంరాజు మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ డ్రాఫ్టు ఇది.

ఒకనాటి ప్రియమైన జగనన్నయ్య కు కన్నీళ్లతో నీ సోదరి రాస్తున్న విన్నపం !

అన్నయ్యా , నువ్వు ఎన్నికల ముందు వేసిన వీడియోలు , నీ నడకలో చెప్పిన మాటలు నమ్మి నీకు ఓటు వేసాను. అమ్మ వొడి, ఆసరాలు ఎగస్ట్రా డబ్బులు అనుకున్నాను. కానీ నువ్వు నా భర్త దగ్గర నుంచి రోజుకు 150 రూ లెక్కన సంవత్సరానికి 54 వేలు జలగలా లాగేస్తున్నావు. పైగా ఆసుపత్రి ఖర్చులు. ఇచ్చింది ఏమో అమ్మ ఒడికి 13 వేలు ఆసరా 15 వేలు. కూడితే 28 వేలు. నేను నీ బటన్ నొక్కుడుకి ఇచ్చింది 26 వేలు. అంటే నా దగ్గర ఐదేళ్ళలో లాగింది ఒక లక్షా ఇరువై తొమ్మిది వేలు ప్లస్ 13 వేలు. ఎందుకంటే ఒక సంవత్సరం అమ్మ వోడి ఎగ్గొట్టావు కదా! నువ్వు ఓటుకు 5 వేలు ఇచ్చినా మాకు ఇంకా 142 మైనస్ 5 వేలు అనగా 1 లక్ష 37 వేలు నువ్వు బాకీ తమ్ముడూ ! నీ మందు తాగాక లివరు, కిడ్నీలు కొట్టేస్తున్నాయి. హాస్పిటల్ కి వెళితే సర్వం గుల్ల   పైగా నువ్వు మద్య నిషేధం చెయ్యకపోతే ఓటు అడగనని మాటిచ్చావు కూడా….గుర్తుందా!

చెల్లెమ్మ చెల్లెమ్మా అంటూ మా పొదుపు సొమ్ములకు కూడా చిల్లెట్టేసావు. నా మాంగళ్యాన్నీ బ్యాంకు వాళ్లకి  పాతికేళ్ళకు తాకట్టు పెట్టావు. నా బిడ్డల భవిషత్తుని నాశనం చేసావు. అందుకని పనికిమాలిన సొల్లు కబుర్లు ఆపి మా బాకీ లక్షా 42 వేలు నాకు  కట్టి అప్పుడు బస్సు యాత్రకు రామ్మా !

ఇట్లు , తమ్ముడు కానీ ఓ తమ్ముడి మాట నమ్మి మోసపోయిన నీ(అ)ప్రియ సోదరి.

ఈ విధంగా లేఖ రాసి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తాడేపల్లి, గుంటూరు జిల్లా కు పంపాలని, లేకపోతే ఇంటికి వచ్చే వాలంటీర్ కు గానీ, ఎమ్మెల్యేకు గానీ ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

Related posts

ఏపిలో ప్రజల వద్దకు సినిమా

Bhavani

బోనస్: ఆదాయపన్ను శ్లాబ్‌లో భారీ మార్పులు

Satyam NEWS

ఈ నెల 7న ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ”

Satyam NEWS

Leave a Comment