29.7 C
Hyderabad
April 29, 2024 07: 19 AM
Slider నిజామాబాద్

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం

raging

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ పెను భూతంలా మారింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్ధులు అసభ్య పదజాలంతో దూషిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దాంతో విద్యార్థులు సీనియర్లకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి అయిందంటే చాలు సీనియర్లు ఎక్కడ ర్యాగింగ్ చేస్తారోనని విద్యార్థులు జంకుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ తెలంగాణ సౌత్ క్యాంపస్ హాస్టల్ లో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ కు పాల్పడుతున్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా హాస్టల్ లో ర్యాగింగ్ జరుగుతున్న హాస్టల్ వార్డెన్లు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో విద్యార్థులు మీడియాకు లీకులు ఇచ్చారు. ఇప్పుడు క్యాంపస్ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే గత శనివారం రోజున పత్రికల్లో క్యాంపస్ లో జరుగుతున్న ర్యాగింగ్ పై కథనాలు వచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. సోమవారం ఇదే అంశంపై భిక్కనూర్ సిఐ యాలాద్రి క్యాంపస్ కు వచ్చి విచారణ చేపట్టారు. దాంతో కొంత మంది విద్యార్థులు హాస్టల్ లో జరుగుతున్న సీనియర్ల ఆగడాలను పోలీసుల ముందు చెప్పుకున్నారు. ఇంట్రడక్షన్ క్లాసుల పేరుతో రాత్రి 9 గంటల తర్వాత సీనియర్ విద్యార్ధులు జూనియర్లను తమ రూములోకి పిలుచుకుని గంటల తరబడి ప్రశ్నలు సందిస్తున్నారని తెలిపారు. రూంలోకి వెళ్లిన తర్వాత సీనియర్ల ముఖాలు కనపడకుండా లైట్స్ ఆఫ్ చేసి ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని పోలీసుల ముందు వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ప్రిన్సిపాల్ కు చెప్పుకున్నా ఏమి పరవాలేదంటూ మాట్లాడుతున్నారని తెలిపారు. ఓ విద్యార్థికి జ్వరం వచ్చినా లెక్క చేయకుండా టాబ్లెట్ వేసి రాత్రి రెండు గంటల వరకు ఇబ్బందులకు గురి చేసారని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ కు చెప్పగా దిద్దుబాటు చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ విషయంపై క్యాంపస్ ప్రిన్సిపాల్ మోహన్ బాబు, సిఐ యాలాద్రిని వివరణ కోరగా సీనియర్ విద్యార్ధులు చిన్న చిన్న అంశాలపై జూనియర్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరం అయితే క్యాంపస్ నుంచి విద్యార్థులను తొలగిస్తామని చెప్పారు.

Related posts

నిన్నటి వరకూ బిర్యానీ పంచిన చేతులు నేడు కరోనా…

Satyam NEWS

నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

Satyam NEWS

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: పసుపులేటి ప్రదీప్ కుమార్

Bhavani

Leave a Comment