29.7 C
Hyderabad
April 29, 2024 07: 20 AM
Slider ప్రత్యేకం

తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర

#rahulgandhi

కామరెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర రెండో రోజు సోమవారం ఉదయం 6 గంటల నుండి బిచ్కుంద మండలంలోని ఫతలపుర్ గ్రామం నుండి బయలుదేరింది,161 జాతీయ రహదారి గుండా కొనసాగుతున్న ఈ యాత్రలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

నాలుగంచల భద్రత మధ్య యువరాజు పాదయాత్ర కొనసాగుతున్నది. మండలంలోని కందర్ పల్లి, రాజుల చౌరస్తా, ఎకలార గేట్, తర్వాత టీ విరామం తీసుకున్నారు. పది నిమిషములు తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కొడిచిరా గేట్ నుండి లచ్చన్ గేట్ వరకు పాదయాత్ర కొనసాగింది అనంతరం వీరంమం తీసుకున్నారు. విరమ అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు మేనూరు గ్రామంలో జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి మోడీ రాష్ట్రానికి కెసిఆర్ నియంతల తయారయ్యారని దుయ్యబుట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరి పాలనలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిద్దరిని గదించటానికి కాంగ్రెస్ శ్రేణులు కంకణం కట్టుకొని పోరాడాలి అన్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయనాయకులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఉసురు తీసుకుంటుందని అన్నారు.

తాను చేపట్టిన జోడో యాత్రలో ఎన్నో సమస్యలు కళ్లతో చూశానన్నారు.ప్రతి పేదోడి కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ధేయమన్నారు. తాను చేపట్టిన ఈ 17 రోజుల తెలంగాణ యాత్రలో సామాన్య ప్రజల కష్టసుఖాలను గమనించానని వారందరూ సుఖశాంతులతో ఉండాలన్నదే తన ఉద్దేశమని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేనని ఆయన ఆరోపించారు.

పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టిన ఆ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడమే అందుకు నిదర్శనం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టి అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే నాకు ఎంతో అభిమానం అని ఇక్కడి ప్రజలు చాలా మంచి హృదయం ఉన్నవారు అన్నారు.

ఈ 17 రోజులపాటు తాను చేపట్టిన భారత్ జూడో యాత్ర తనకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చింది అన్నారు. అందరి సుఖదుఃఖాలు తెలుసుకోవడానికి ఈ అవకాశం తనకు దక్కిందన్నారు. కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్,మాజీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంతరావు, శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య,,సీతక్క, బలరాం నాయక్, బల్మూరి వెంకట్, టిపిసిసి ఐటీసీఎల్ నాయకులు మదన్మోహన్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, సినియర్ నాయకులు కె.వి వేణుగోపాల్, సంపత్ కుమార్, జీవన్ రెడ్డి ,గీతారెడ్డి , సుబ్బారామిరెడ్డి,పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,మాజీ ఎంపీ సురేష్ షేట్కార్ ,గడుగు గంగాధర్, జుక్కల్ మాజీ శాసనసభ్యులు గంగారం, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మధుయస్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, నాగనాథ్, వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జిల్లాల నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కరోనా కలకలం: ఖననానికి అడ్డు చెప్పిన గ్రామస్తులు

Satyam NEWS

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సచీవాలయ కార్యదర్శి

Satyam NEWS

కడపలో సర్పంచుల సమర శంఖారావం

Bhavani

Leave a Comment