30.7 C
Hyderabad
April 29, 2024 06: 33 AM
Slider ప్రత్యేకం

వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో స్వామి వివేకానంద చికాగో ఉపన్యాస దినోత్సవం

#vivekananda

ఆన్ లైన్ న్యూస్  స‌ర్వీస్  స‌త్యం న్యూస్.నెట్ శ‌ర వేగంగా దూసుకెళుతోంది. తాజా వార్తాల‌తో పాటు విశ్లేణాత్మ‌క క‌థ‌నాలను ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తూ వ‌స్తున్న స‌త్యం న్యూస్. నెట్ కు విశేష స్పంద‌న వస్తోంది.

ఇటీవలే  విజ‌య‌న‌గరం జిల్లాలో  1800 సంవ‌త్స‌రం కాలం నాటి వ్యాస‌నారాయ‌ణ మెట్ట గురించి అయిదు వార్తా క‌థ‌నాల‌ను ప్ర‌చురంచింది. దీంతో  ఆ వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌కు తాకిడి ఎక్కువైంది. తాజా న‌గ‌రానికి చెందిన స్పార్క్,నిత్య దైవ నామ స్మ‌ర‌ణ‌లు అక్క‌డే ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌తో చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే దినోత్స‌వాల‌ను నిర్వహిస్తోంది.

ఈ నేప‌ధ్యంలో నాటు స్వామి వివేకానంద చికాగాలో నిర్వహించిన హిందూ స‌భ తేదీ తో పాటు నేటిత‌రాల‌కు ఆ స్పూర్తిని అందివ్వాల‌నే ఉద్దేశ్యంతో వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో  బ్రద‌ర్ హుడ్ డే (“universal brother hood day) ను  నిర్వ‌హించింది…….నిత్య దైవ నామ స్మరణ , స్పార్స్ సంస్థ‌లు.ఈ కార్య‌క్ర‌మానికి   శ్రీ నారాయణ స్వామి ముఖ్యఅతిధిగా హాజ‌రై మాట్లాడారు.

అమెరికాలో,చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో  స్వామి వివేకానంద భారత దేశం గొప్పతనం, హిందూ ధర్మం గొప్పతనం తెలియపరచి ఈ దినాన్ని యూనివ‌ర్స‌స్ బ్రద‌ర్ హుడ్ డే జ‌రుపుకుంటున్న‌మ‌న్నారు. ఈ నేప‌ధ్యంలో  బాబామెట్ట‌లో  ప్ర‌తిస్టాత్మ‌క‌మైన వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో స్వార్క్ ,నిత్య దైవ నామ స్మ‌ర‌ణ లు ఆ  దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నాయ‌న్నారు.

ప్రతి మనిషి తోటి వారితో సోదర భావం తో ఉండాలని కోరారు. కుల ,మత, వర్గ ,వర్ణ విభేదాలతో ప్రజలు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. హిందూ ధర్మం బోధించిన “వసుధకై కుటుంబం”, సర్వే జనా సుఖినోభవంతు” సూత్రాలతో కలిసి మెలిసి ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పద్మనాభం,ఉమ శంకర్,స్థానిక యువత పాల్గొన్నారు.

Related posts

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: మంచు కొండల్లో తగ్గిన హింస

Satyam NEWS

వ‌ర‌ద స‌హాయం ఎలా అందుతోంది?

Sub Editor

పండుగల నిర్వహణకు అంతర్ శాఖ సమన్వయ సమావేశం

Satyam NEWS

Leave a Comment