30.7 C
Hyderabad
April 29, 2024 05: 38 AM
Slider జాతీయం

ప్రతిపక్షాలపై దాడులు ఆపాలి

#tripura

త్రిపురలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కల్పించాలని కోరుతూ సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సదస్సులో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రతిపక్షాలపై బీజేపీ హింసాత్మక చర్యలను ఖండించారు.

ప్రతిపక్షాల మద్దతుదారులే లక్ష్యంగా అధికార బీజేపీ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగే ఎన్నికలలో సీపీఎం, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయని ఈ ఎన్నికల్లో త్రిపుర నౌదాన్ పార్టీతో జత కట్టిన బీజేపీ అరాచకాలకు పాల్పడుతుందన్నారు. ఈ మేరకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని తెలిపారు. త్రిపుర ఓటర్లలో అత్యధిక మంది స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదని ఈసీకి దృష్టికి తీసుకెళ్లారన్నారు.

ఇటీవల త్రిపురకు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్లు దిగుమతి అయ్యాయని, వీటిపై అధికార బీజేపీకి చెందిన గూండాలు ప్రయాణిస్తూ గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. వామపక్షాలకు బలమున్న ప్రాంత్రాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఈసీకి విన్నవించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, బెదిరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

బీజేపీకి అనుకూలంగా లేనివారి దుకాణాలు, చేపల చెరువులను ధ్వంసం చేశారని చెప్పారు. సీపీఎం కార్యాలయాలను ధ్వంసం చేశారని చెప్పారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, లెనిన్ విగ్రహాలను సైతం కూల్చివేశారన్నారు. ఇటువంటి పరిస్థితులలో త్రిపుర రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో గ్యాంగులుగా ఏర్పడ్డ కొంతమంది బీజేపీ కోసం పనిచేస్తున్నారన్నారు.

ప్రతిపక్షాల వైపు ఉంటారనే వారిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రముఖ డాక్టర్ యలమంచలి రవీంద్రనాథ్ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటేసే పరిస్థితి అక్కడ లేదన్నారు. దీనిని వెంటనే ఆపాలని కోరారు. బీజేపీ ఓటమి ఖాయమని దాదాపు నిర్ధారణ కావడంతో జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. త్రిపురలోని పెద్ద పెద్ద రోడ్లపైన్నే కాదు, అంతర్గత రోడ్లపైన మోటార్ సైకిళ్ల ర్యాలీలపై నియంత్రణలు విధించాలని ప్రముఖ వక్త ఐవీ రమణారావు పేర్కొన్నారు.

ఓటర్లలో విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత ఈసీపై ఉందని తెలిపారు. స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేట్టు చర్యలు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం సీపఎం బృందానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో దానిని నిలుపుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. విక్రమ్, సీనియర్ నాయకులు ఎం. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జానారెడ్డిని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

Satyam NEWS

దేశం విడిచిపెట్టిపోతున్న కోటీశ్వరులు

Satyam NEWS

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

Leave a Comment