33.7 C
Hyderabad
April 30, 2024 01: 03 AM
Slider సినిమా

రభస చేసి రాజీనామా చేసిన హీరో రాజశేఖర్

actor-rajashekar-latest-stills16

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఉపాధ్యక్ష పదవి నుంచి హీరో రాజశేఖర్ తప్పుకున్నారు. మా ఎలక్షన్స్ జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచే మా అసోషియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌, ఉపాద్యక్షుడు, కార్యదర్శి రాజశేఖర్‌, జీవితల మధ్య వివాదం చెల‌రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రెండుగా చీలిపోయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ లో ఇప్పుడు మరో కుదుపు వచ్చింది.

ఒక వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సంఘంలో చాలా గొడవలు ఉన్నాయి. డైరీ ఆవిష్కరణలో సభలో రభస జరిగిన నేపథ్యంలో నటి జీవిత స్పందించారు. తన భర్త రాజశేఖర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు తెలిపారు. చిరంజీవి, మోహన్ బాబు వంటి దిగ్గజాలు సైతం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేలా ప్రసంగించిన రాజశేఖర్ ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సెగలు పుట్టించారు. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనంటూ చిరంజీవి డిమాండ్ చేశారు. దాంతో జీవిత వేదికపైకి వచ్చి మాట్లాడారు.

రాజశేఖర్ చిన్నపిల్లవాడు లాంటోడని అన్నారు. ఆయన తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని రాజశేఖర్, తాను ఎంతో తపన పడ్డామని అన్నారు. విభేదాలు ఎక్కడైనా ఉంటాయని, గొడవలు రావడం సహజమేనని పేర్కొన్నారు. అందరం మానవమాత్రులమేనని, దేవుళ్లం కాదని అభిప్రాయపడ్డారు. అయినా చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తం అవుతుండటంతో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు.

Related posts

దేశం కోసం ఉరికంబం ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్

Satyam NEWS

వర్షం

Satyam NEWS

సైబర్ నేరాలపై ఫిర్యాదుల నెంబర్ ఇక 1930

Satyam NEWS

Leave a Comment