30.7 C
Hyderabad
April 29, 2024 05: 52 AM
Slider తూర్పుగోదావరి

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

#kakinadapolice

“అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం” సెప్టెంబర్-10 పురస్కరించుకుని నేడు కాకినాడ జిల్లా పోలీసు శాఖ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ల అధ్వర్యంలో “ఆత్మహత్యల నివారణ – అవగాహన ర్యాలీ” చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు జెండా ఉపి ప్రారంభించారు. స్థానిక రంగరాయ మెడికల్ కాలేజీ   నుండి భానుగుడి జంక్షన్ వరకు కొనసాగిన ఈ ర్యాలీ లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది, మహిళా పోలీసులు, పెద్ద సంఖ్యలో స్థానిక యువత, వివిధ కళాశాలకు చెందిన విద్యార్ధిని విద్యార్ధులు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ, ప్లకార్డులను చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం భానుగుడి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డయాస్ వద్దకు చేరుకొని ఆత్మహత్యల వ్యతిరేక ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో SP గారు మాట్లాడుతు చాల మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, నిత్య జీవితంలో సమస్యలు వస్తుంటాయని, వాటికి అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కారం బలాన్మరణం కాదనే  విషయాన్నీ గమనించాలని తెలియజేసారు. అనంతరం ఆత్మహత్యలకు  వ్యతిరేకంగా అవగాహన కల్పించే పోస్టర్ ను  SP రవీంద్రనాథ్ బాబు,  RMC ప్రిన్సిపాల్ , IMA మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో SP తో పాటు అడిషనల్ SP అడ్మిన్ P.శ్రీనివాస్, అడిషనల్ SP AR B.సత్యనారాయణ, RMC ప్రిన్సిపాల్ Dr.నరసింహం, సైకియాట్రిక్ డిపార్టుమెంటు HOD Dr.రామిరెడ్డి, IMA ప్రెసిడెంట్ Dr.పవన్ కుమార్, సెక్రెటరీ Dr.కిరణ్ కుమార్, మానసిక వైద్య నిపుణులు Dr. V.వరప్రసాద్, SB DSP Mవెంకటేశ్వరరావు, SDPO కాకినాడ V.భీమారావు, దిశ DSP సుంకర మురళీ మోహన్, ట్రాఫిక్ DSP P.మురళీ కృష్ణ రెడ్డి, CCS DSP S.రాంబాబు, SC/ST సెల్ DSP B.అప్పారావు, AR DSP అప్పారావు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికోలు,నర్సింగ్ స్టూడెంట్స్, మహిళా పోలీసులు మరియు స్థానిక పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సీనియర్ సిటిజన్స్ కు సహకరిస్తా: ఉప్పల్ ఎమ్మెల్యే బెతీ సుభాష్ రెడ్డి

Satyam NEWS

రాజయోగం కోసమే కేసీఆర్ రాజ్యశ్యామల యాగం

Murali Krishna

మళ్లీ క్షిపణి ప్రయోగం: పెట్రేగిపోయిన ఉత్తర కొరియా

Satyam NEWS

Leave a Comment