మొక్కలు నాటడం గొప్ప కార్యం – సంరక్షించడం మహత్కార్యం అని జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం అని రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ్య సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ మొక్కలను నాటారు.
మరో మూడు మొక్కలను నాటేందుకు పెద్దపల్లి డిసిపి పి.రవీందర్, మంచిర్యాల డిసిపి డి.ఉదయ కుమార్,ఆడిషనల్ డిసిపి రవి కుమార్ మరియు ఏఅర్ డిసిపి కమాన్డెంట్ సంజీవ్ లను ఆహ్వానించారు. డిసిపిలు ఎసిపిలను ఆహ్వానించారు, ఎసిపిలు సిఐలను, సిఐ లు ఎస్ఐ లను ఆహ్వానించారు . ఏవిధంగా హెడ్ క్వార్టర్స్ ఆవరణలో ఈ రోజు 150 మొక్కలను నాటారు.
సిపి మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ లోని హోం గార్డ్ అధికారి నుండి ఉన్నత అధికారి వరకు 1800 మంది ప్రతి ఒక పోలీస్ సిబ్బంది ,పారుడు మూడు మొక్కలు నాటి మూడు సంవత్సరాల పాటు సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం లేకపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలిపారు. పర్యావరాన్ని పరిరక్షించే చర్యలకు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి ప్రాంతంలో పోలీస్ శాఖ మొక్కలు నాటుతూ మొక్కలను సంరక్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యకమంలో పెద్దపల్లి డిసిపి పి. రవీందర్, అడిషనల్ డిసిపి లాండర్ రవికుమార్, అడిషనల్ డిసిపి ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏసీపి మంచిర్యాల్ సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇంకా ఏసీపీ పెద్ద పల్లి హబీబ్ ఖాన్, ఏసీపి బెల్లంపల్లి రహమాన్, ఏసీపి జైపూర్ నరేందర్, ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు, సిఐలు ఎడ్ల మహేష్, సిహెచ్ వెంకటేశ్వర్లు, జి.వెంకటేశ్వర్లు, నారాయణ నాయక్, బి రాజు, ప్రవీణ్ కుమార్, మహేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, పి రమేష్, కోటేశ్వర్, బాబురావు,కిరణ్, శ్రీనివాసరావు, ఆర్ఐ మధుకర్, రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.