39.2 C
Hyderabad
April 30, 2024 22: 33 PM
Slider శ్రీకాకుళం

మనసుకి సంగీతం, ఆటలు శారీరక అభివృద్ధికి అవసరం

skl sports

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో పెద్ద పాడు గ్రామం లో పెద్దపాడు ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం  ఫిట్ ఇండియా కార్యక్రమంలో చివరి రోజు భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ మనసుకి సంగీతం ఎంత అవసరమో, ఆటలు శారీరక అభివృద్ధికి అంతే అవసరం  అని అన్నారు.

 విద్యార్థిని విద్యార్థులతో ఖోఖో, కబడ్డీ, సాంప్రదాయ ఆటలు అయినా దొంగ పోలీసు,  బొంగరాల ఆట ఆడించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాబు మోహన్ ఈ వారమంతా ఫిట్ ఇండియాలో ప్రతి రోజు జరిగే కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి.సత్యవతి, ఎస్ .వి. కృష్ణారావు, ఎం. శాంతారావు, జి .భూషన్ రావు, డి .యమ్ .మల్లేశ్వరి, కే. సురేష్ కుమార్, క్రాఫ్ట్ బి. త్రివేణి, ఆర్ట్ సిహెచ్. రవికుమార్, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ వేంకటేశ్వరా నీకు ఇంత పక్షపాతమేల స్వామీ?

Satyam NEWS

ఆగస్టు 15న విడుదల కానున్న రణరంగం

Satyam NEWS

సుజనా చౌదరిని ఓడించేందుకు వంద కోట్లు ‘‘సిద్ధం’’?

Satyam NEWS

Leave a Comment