34.2 C
Hyderabad
May 19, 2025 17: 45 PM
Slider సినిమా

ఐదున్నర కోట్లు ఆర్జించిన పవర్ స్టార్ చిత్రం

#Power Star

రామ్ గోపాల్ వర్మ తీసిన పవర్ స్టార్ చిత్రం బాక్సాఫీస్ కొల్లగొడుతున్నది. పవర్ స్టార్ చిత్రానికి కాసుల వర్షం కురుస్తున్నది. విడుదలైన తొలి రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేసింది. చిత్రం విడుదలైన రెండు రోజుల్లో ఐదున్నర కోట్ల రూపాయలు వసూలు చేయడం రికార్డు.

కరోనా సమయంలో అందరు నిర్మాతలు నెత్తిన చెంగు కప్పుకుని కూర్చున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. క్లైమాక్స్, నేకెడ్ లాంటి అశ్లీల చిత్రాలు తీసిన సొమ్ము చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పవర్ స్టార్ తో ఆ రెండు చిత్రాల కలెక్షన్లు కూడా అధిగమించాడు.

కరోనా లాక్ డౌన్ లో సినిమాలు తీయడమే కాకుండా వాటిని ఓటీటీ ప్లాట్ ఫారమ్ పై విడుదల చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతాడు.

Related posts

అమరావతి మహిళా రైతులపై కేసులే కేసులు

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్‌

mamatha

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!