39.2 C
Hyderabad
May 3, 2024 12: 41 PM
Slider చిత్తూరు

చిల్లర ప్రాజెక్టులు కాదు సీమను సమగ్రంగా అభివృద్ధి చేయాలి

#naveenkumarreddy

రాయలసీమలో “చిల్లర ప్రాజెక్టులు” కట్టి చప్పట్లు కొట్టించుకుంటూ సీమ ప్రజలను,రైతాంగాన్ని పచ్చిగా దగా చేస్తున్నారని రాయలసీమ నేతలు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో రాయలసీమ పోరాట సమితి కన్వినర్ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడిన రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో కృష్ణానదిపై 1200 కోట్లతో నిర్మిస్తున్న (ఉయ్యాల వంతెన) ఐకానిక్ బ్రిడ్జి కన్నా “బ్రిడ్జ్ కం బ్యారేజ్” నిర్మించి సీమ ప్రజల దాహార్తి తీర్చాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని, రాయలసీమ నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. రాయలసీమకు ప్రతీ సారి అన్యాయం జరుగుతోంది సీమ ప్రజల సహనాన్ని చేతకానితనంగా తీసుకోకండి అంటూ వారు హెచ్చరించారు.

సీమ అభివృద్ధి చెందాలంటే “నిధులు” “నియామకాలు” “నీళ్ళు” ప్రధానం అని వారన్నారు. ఐటీ సెక్టార్ అభివృద్ది చెందాల్సి ఉన్నా ప్రభుత్వ పోత్సాహం లేదు నిరుద్యోగ యువత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లే దౌర్భాగ్యపు స్థితి రాయలసీమలో ఏర్పడింది. రాయలసీమ నీటీ వాటాలలో పచ్చి మోసం జరుగుతున్నా నీటి ప్రాజెక్టుల మంత్రులకు అవగాహన లేకపోవడంతో పక్క రాష్ట్రాల వారు దర్జాగా మన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాలో “పాలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల కడుపు కొడుతున్నారు చక్కెర పరిశ్రమలు మూతపడ్డా పట్టించుకునే నాధుడే లేదు. రాయలసీమలో రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు ఈ పాలకులు…అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు తాగేటందుకు గుక్కెడు నీళ్ళను కూడా ఇవ్వలేని కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని, తెలుగంగ నీరు చెన్నైకి 15 టీఎంసీలు వెళుతుంటే తిరుపతికి కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఇచ్చి నయవంచన చేస్తున్నారని వారు విమర్శించారు.

రాయలసీమ వ్యాప్తంగా ఉ‌న్న పరిశ్రమలు మూతపడ్డాయి,కొత్తవి రాలేదు ” అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని” అన్నట్లు సీమ ప్రాంత ప్రజల పరిస్థితి దాపురించింది! సీమలో ఇన్ని నదులు ఉన్నా తరతరాలుగా అన్యాయం జరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్డులో పెద్ద పెద్ద గోతులు పడ్డాయి,ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని ఎక్స్పర్ట్ కమిటి చెప్పింది కానీ పట్టించుకునే నాధుడే లేదు. రాజంపేటలో “అన్నమయ్య ప్రాజెక్టు” గేట్లు తెగిపోయి పరిసర గ్రామాల ప్రజలు ఎంతో నష్టపోయారు

ఇప్పటివరకు గేట్లు బిగించే ఆర్థిక స్తోమత ఈ ప్రభుత్వానికి లేదు. “బ్రిడ్జి కమ్ బ్యారేజ్” నిర్మాణం డిమాండ్ తో పోరాటానికి సిద్దం కలిసి వచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నాం. జనవరి 28 న చలో సిద్దేశ్వరం, సంగమేశ్వరం “ప్రజా ప్రదర్శన”కు పిలుపునిచ్చాం.. సీమ నేతలంతా కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నాం రాయలసీమ భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం అని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు అశోక్ వర్ధన్ రెడ్డి,రవికుమార్,సీమ కృష్ణ, అశోక్, నల్లారెడ్డి, బజారి, గణేష్, శ్రీకాంత్ చిన్న మహేష్ మణి చిన్ని యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటు అనుమతి లేదు

Satyam NEWS

టికెట్ కేటాయింపులో షబ్బీర్ అలీ హోదా ఏంటి..?

Satyam NEWS

Leave a Comment