29.7 C
Hyderabad
May 1, 2024 06: 47 AM
Slider ఖమ్మం

పేద కుటుంబాలకు భరోసా

#lingala

పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు.  మధిర మండలం ఆత్కూరు గ్రామం లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అమలు చేస్తున్నట్లు తెలిపారు కంటి వెలుగు శిబిరం లో వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేసిన అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను అందించడం జరుగుతోందని పేర్కొన్నారు.  ప్రజలెవరు కంటి సమస్యల తో బాధపడవద్దనే లక్ష్యం తో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.  వేలాది కుటుంబాలకు అండగా మారిన బృహత్తర పథకం కంటి వెలుగు అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పేద కుటుంబాలకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు.  ఈ కంటి వెలుగు ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Related posts

రెండో భ‌ద్రాద్రిలో వైభ‌వోపేతంగా జర‌గ‌నున్న‌ శ్రీరామ‌న‌వ‌మి వేడుకలు…!

Satyam NEWS

నల్గొండలో నర్సింగ్ అధికారుల కొవ్వొత్తి ర్యాలీ

Satyam NEWS

కరోనా కాలంలో డిప్యూటీ త‌హ‌శీల్దారుకే దిక్కులేని పరిస్థితి…..

Satyam NEWS

Leave a Comment