35.2 C
Hyderabad
May 1, 2024 00: 33 AM
Slider తూర్పుగోదావరి

మహిళా రిజ్వరేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

#womenbill

మహిళా రిజ్వరేషన్ చట్టాన్ని 2024 సార్వత్రిక ఎన్నికలలో అమలు చేయాలని దీనిపై మహిళా లోకం గళమెత్తాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర పూర్వపు అధ్యక్షురాలు మహిళా జాతీయ నేత అక్కినేని వనజ పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సిపిఐ కార్యాలయంలో మహిళా సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా జనరల్ బాడీ సమావేశము సేపని రమణమ్మ అధ్యక్షతన జరిగింది. ముందుగా అక్కినేని వనజ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల ముందే అమలు చేయాలని నిత్యావసరాల ధరలు తగ్గించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్లను త్వరలో రానున్న 2024 ఎన్నికల ముందే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చట్టసభలతో మహిళలకు మూడవ వంతు రిజర్వేషన్ కోసం తన తుది శ్వాస వరకు పార్లమెంట్ సభ్యురాలు గీతాముఖర్జీ పోరాడారని గుర్తు చేశారు. అనాడు పార్లమెంట్ మౌనం వహించిందన్నారు. 2029 ఎన్నికల నాటికి అమలు చేస్తామని చెప్పటం మహిళలను మోసం చేయటమేనన్నారు. మణిపూర్ అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవటాన్ని తీవ్రంగా ఖండించారు. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, పంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సందర్భంగా ప్రజలు అనేక కష్టాలు పడ్డారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి -ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చిన మోదీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహిళా సమాఖ్య చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాలను ఆమె వివరించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు రూ. 5వేలు పింఛన్ ఇవ్వాలని, విభిన్నప్రతిభావంతులకు నెలకు రూ. 6వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

నూతన కమిటీ

మహిళా సమాఖ్య నూతన కన్వీనిoగ్ కమిటీ ను జనరల్ బాడీ ఏకగ్రీవంగా ఆమోదించింది. జిల్లా కన్వీనర్ గా సిడగo దుర్గ, కో కన్వీనర్ గా ఎమ్ ముత్యాలు, కముటి సభ్యులుగా సేపని రమణమ్మ, బేగం కోడబాల వరలక్ష్మి, కొండవతి, బంగారు దుర్గాలక్ష్మి, జగ్గమ్మ,రాజేశ్వరి,రాజ్యలక్ష్మి,కే ఉష లు ఎన్నికయ్యారు.

Related posts

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో ట్రాఫిక్ వింగ్ లో కదలిక

Satyam NEWS

బంద్ సందర్భంగా రాస్తారోకో చేసిన టీడీపీ నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment