30.7 C
Hyderabad
April 29, 2024 03: 39 AM
Slider ప్రత్యేకం

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

#vizag

కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఉన్నా మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతూనే ఉన్నది. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయాలు, విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది. ఆంధ్రా వర్సిటీ, రుషికొండ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించారు. పలు శాఖలకు ఎండాడ, హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడో ప్రభుత్వం జీవోలో వెల్లడించలేదు.

Related posts

ఏపి నూతన సీఎస్ గా సమీర్ శర్మ

Satyam NEWS

రేపు రాజన్న సిరిసిల్ల లో సీఎం కేసీఆర్ పర్యటన

Satyam NEWS

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్య పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment