40.2 C
Hyderabad
May 2, 2024 16: 16 PM
Slider మహబూబ్ నగర్

హెచ్ పి గ్యాస్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

#rachala

నిరుపేదల భూముల్లో అక్రమంగా చట్టవిరుద్దంగా పైప్ లైన్ వేస్తున్న హెచ్ పి గ్యాస్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పైప్ లైన్ అలైన్ మెంట్ మార్చి పేదల భూములు కాపాడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.

శనివారం వనపర్తి జిల్లా రాజపేట శివారులో పేదల భూముల్లో అక్రమంగా వేస్తున్న పైప్ లైన్ ను సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ తో కలిసి పరిశీలించి రైతులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ ఇక్కడ మెజార్టీగా గిరిజన భూములే  ఉన్నాయని దీంతో పాటు దాదాపు 50 మంది నిరుపేదల ఫ్లాట్లు ఉన్నాయని వీరి స్థలాలలో హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ సంస్థ చట్టవురుద్దంగా పైప్ లైన్ వేస్తుందని, ఇదేమిటని ప్రశ్నించిన బాధితులపై దౌర్జన్యం చేస్తూ తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారని,ఆవేదన వ్యక్తంచేశారు.

రైతుల భూముల్లో రైతులకు సమాచారం లేకుండా పైప్ లైన్ వేసే హక్కు హెచ్.పీ గ్యాస్ సంస్థకు ఎవరిచ్చారని  ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు  భూములను తీసుకోవాలంటే ముందుగా వారికి నోటీసులు ఇచ్చి వారి అనుమతి తోనే పనులు జరపాలని కానీ హెచ్. పి.  గ్యాస్ సంస్థ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వారి అనుమతి తీసుకోకుండా దౌర్జన్యంగా పైప్ లైన్ వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని చట్టంలో ఉన్న విషయం  అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని రైతులను ఎందుకు పట్టించుకోవటం లేదని, గత 9 రోజులుగా రైతులు టెంట్ వేసుకుని ధర్నా చేస్తూ కలిసి మొర పెట్టుకున్న కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.

హెచ్ పి గ్యాస్ సంస్థపై  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో  మంగళవారం ఫిర్యాదు చేశామని, స్పందించిన కమిషన్ ఫిబ్రవరి 3వ తేదీన సమగ్ర నివేదికతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ను హెచ్.పీ గ్యాస్ సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించిందని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు   బీసీ సంక్షేమ సంఘం రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు.

బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావలి మధులత మాట్లాడుతూ  రైతు వనపర్తి నియోజకవర్గంలో రాబందులు తయారయ్యారని విమర్శించారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు మధు గౌడ్, సీపీఐ నాయకులు చంద్రయ్య, ఎస్సీ ఎస్టీ జిల్లా మానిటరింగ్  గంధం నాగరాజు, బీసీ సంఘాల నాయకులు జుర్రు నారాయణ, కుర్మయ్య యాదవ్, వీరయ్య, బాలరాజు గౌడ్,అంజన్న యాదవ్, మహీందర్ నాయుడు, తిరుపతయ్య గౌడ్, నరసింహ  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్

Related posts

సంక్రాంతి..సర్వజన సుఖశాంతి

Satyam NEWS

ఏపిలో పెరిగిపోతున్న రాజ్య హింస

Satyam NEWS

పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదు

Bhavani

Leave a Comment