26.7 C
Hyderabad
April 27, 2024 07: 11 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి..సర్వజన సుఖశాంతి

#shyamalanew

ఇంతుల కళాత్మకతను చాటే

ఇళ్ల ముంగిటి ముగ్గులు

బద్ధకాన్ని తగలేయమంటూ

భోగిమంటల భగభగలు

మంచి మార్పుకు సంకేతమిస్తూ

మకర రాశికి చేరే సూరీడు

అలౌకికానందం కలిగించే

హరిదాసుల నృత్యగానాలు

కొత్త బియ్యపు పొంగళ్ళు

సరికొత్త ఆశల పరవళ్ళు

పనికైనా సై..ఆటకైనా సైసై అంటూ

గర్వంగా తలలూపే గంగిరెద్దులు

చుట్టపక్కాలతో

విందు భోజనాల సందళ్లు

పిల్లల పెద్దల నవ్వుల పువ్వులు

భోగిపళ్ల పేరంటాలు

బ్రహ్మ కూడా మెచ్చే

బొమ్మల కొలువులు

ఘనమైన లక్ష్యాల సాక్ష్యాలు

గగనవీధుల ఎగిరే గాలిపటాలు

శోభాయమాన సంక్రాంతి

కావాలి సర్వజన సుఖశాంతి!

జె.శ్యామల

Related posts

బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి

Satyam NEWS

నగరిలో ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నాం

Satyam NEWS

జియో సెల్ టవర్ పై మంత్రి సింగిరెడ్డికి ఫిర్యాదు

Satyam NEWS

2 comments

Gannavarapu Narasimha Murty January 15, 2022 at 9:24 AM

సంక్రాంతి మీద గేయం బాగుంది
మీకు అభినందనలు

Reply
Pushpa January 15, 2022 at 2:23 PM

సంక్రాంతి గేయం చాలా బాగా రాశారు ధన్యవాదాలు?

Reply

Leave a Comment