40.2 C
Hyderabad
April 29, 2024 15: 16 PM
Slider నెల్లూరు

హైదరాబాద్ లో  ఎపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ వీరంగం

#MLA Anil

ఇటీవల కాలంలో ఎపీ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా మారిన మాజీ మంత్రి నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తన దుందుడుకు చర్యలతో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాడు. హైదరాబాద్ లో విధుల్లో ఉన్న అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించి అనిల్ మరో మారు వార్తల్లోకి ఎక్కాడు. అపార్ట్‌మెంట్ ముందు వాహనాలు  పార్క్ చేయ చేయవద్దన్నందుకు సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. అపార్ట్‌మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డుపై ఆయన అనుచరులు ప్రతాపం చూపించడం కలకలం రేపింది. గచ్చిబౌలి – అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్‌లో ఈ పార్కింగ్ వివాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంటు రోడ్డుపై పార్కింగ్ చేయవద్దని సెక్యూరిటీ సూచించారు. దీంతో అనిల్ మనుషులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీపై తమ ప్రతాపం చూపించారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదించారు. ఈ తతంగం మొత్తాన్ని అపార్ట్‌మెంట్ వాసులు వీడియో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Related posts

త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి

Bhavani

చెట్లు కొట్టేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ జరిమానా

Satyam NEWS

గంజాయి స్మగ్లర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు

Satyam NEWS

Leave a Comment