37.2 C
Hyderabad
May 6, 2024 12: 08 PM
Slider ముఖ్యంశాలు

పోలీసులకు చెప్పినా ఫలితం లేదు: మ‌త్స్య కార గ్రామాల‌లో అన్య‌మ‌త ప్ర‌చారం

#fishermen

విజ‌య‌న‌గ‌రం జిల్లా మత్స్య కార గ్రామ‌మైన ముక్కాంలో ప్ర‌తీ రోజూ అన్య మ‌త ప్ర‌చారం సాగుతోంద‌ని…దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ  ఆ గ్రామస్థులు…నేరుగా క‌లెక్ట‌రేట్ లోజ‌రిగే స్పంద‌న లో ఫిర్యాదు చేసారు. అంతే కాకుండా మీరు నిత్యం మీ దేవుళ్ల‌కు పూజ చేస్తే  త‌ప్పు కాని..మా దేవుళ్ల‌ను ప్రార్దిస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని గ్రామ‌స్థులు  ఫిర్యాదు చేసారు.

ఇదే విష‌య‌మై భోగాపురం ఎస్ఐకు ఫిర్యాదు చేసామ‌ని…కానీ ప‌లితం  లేద‌ని వారు వాపోయారు. మీ గుళ్లో మీరు చేసుకోండ‌ని…వాళ్ల‌మీద మీకు ఫిర్యాదు ఎందుకుని మ‌మ్మ‌ల్నే వ్ర‌శ్నించార‌ని గ్రామ‌స్థులు…క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేసారు. గ్రామ‌స్థులు నుంచీ విన‌తి ప‌త్రం తీసుకున్న జిల్లా క‌లెక్ట‌ర్…అటు పోలీసుల‌కు..ఇటు స్థానిక ఎమ్మార్వోను స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ గ్రీన్ పెన్ తో సంత‌కం చేసారు.

అనంత‌రం…స్పంద‌న కార్య‌క్ర‌మం నుంచీ బ‌య‌ట‌కు వచ్చిన గ్రామస్థులు…అక్క‌డే మంత్రి  బొత్స‌తో మీటింగ్ అనంత‌రం…బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎస్పీ దీపిక‌ను క‌లిసి త‌మ ఆవేద‌న‌ను…తెలియ ప‌రిచారు. త‌క్ష‌ణ‌మే అక్క‌డే భోగాపురం సీఐ విజ‌య‌నాద్ ను పిలిచి… గ్రామంలో శాంతి క‌మిటీ స‌మావేశం త‌క్ష‌ణంఏర్పాటు చేసి…స‌మ‌స్య జ‌ఠిలం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్పీ ఆదేశించారు.

గ్రామ‌స్థులు…విలేక‌రుల‌తో మాట్లాడుతూ…..ముక్కాంలో పపిసిల్ల‌ల‌ను సైతం తినుబండారాలు ఇచ్చి మతం మార‌మ‌ని ప్ర‌లోభ పెడుతున్నార‌ని వాపోయారు. స్థానిక ఎస్ఐ కి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా…స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో స్పంద‌న‌కు వ‌చ్చి క‌లెక్ట‌ర్ కు…అక్క‌డ  నుంచీ ఎస్పీకి ఫిర్యాదు చేసామ‌ని… మత్స్య కార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు విద్యా విభాగం ముల్లయ్య,, రాష్ట్ర అధ్యక్షులు, దేవాలయ విభాగం విజయ శంకర ఫణీంద్ర ,గుంటు సతియ్య , రాష్ట్ర కార్యదర్శి , మత్స్య కార సంక్షేమ సమితి, ఉమ్మడి మహేష్ లు తెలిపారు.

Related posts

యశస్తోరణం

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వంపై సమ్మె సమర శంఖం పూరిద్దాం: సిఐటియు

Satyam NEWS

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రధాని క్లారిఫికేషన్

Satyam NEWS

Leave a Comment