28.7 C
Hyderabad
April 28, 2024 04: 43 AM
Slider నెల్లూరు

గుర్రపు డెక్కను తొలగించి ఉదయగిరి వాసులను కాపాడండి

#horse hoof

నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామ మొదట్లో ఉన్న అనకట్ట నీటిలో గుర్రపు డెక్క నాచును తొలగించి గ్రామస్తులకు ఆరోగ్య పరిరక్షణ కల్పించాల్సిందిగా సామాజిక కార్యకర్త ఫయాజ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు.
ఉదయగిరి గ్రామ అనకట్టలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నీటిని ఉదయగిరి వాసులకు రక్షిత నీటి పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ నీటిపైన దట్టమైన గుర్రపు డెక్క నాచు పేరుకుపోయింది.

దీనివల్ల దోమలు విపరీతంగా ప్రబలి గ్రామస్తులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాకుండా చాలా రోగాలు, జ్వరాలు దీనివల్ల వ్యాపిస్తున్నాయి. ఈ నీటి నుంచి విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. దీని వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయమై గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తమరైన జోక్యం చేసుకొని తక్షణం ఈ గుర్రపు డెక్క నాచును తొలగించి, గ్రామస్తులకు ఆరోగ్య పరిరక్షణ కల్పించాలని కోరారు.

Related posts

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Satyam NEWS

‘స్పందన’దృశ్య శ్రవ్య సంచికల ఆవిష్కరణ

Satyam NEWS

విశాఖలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment