30.7 C
Hyderabad
April 29, 2024 04: 17 AM
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

ఎన్​టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్​లో 2023 డిజిటల్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్​ని అందరూ తమ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ , యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ కావలసినవారు డైరెక్ట్ ఎంక్వైరీ చేసుకోవచ్చని తెలిపారు.

రోజువారీ దిన ఫలాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. ఎవరైనా ఎన్టీఆర్ ట్రస్ట్​కి విరాళాలు చేయదలచిన వారు.. ఒక క్లిక్​తో విరాళాలను అందజేయవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్​తో పాటు పలువురు పాల్గొన్నారు.

Related posts

చర్యలు తీసుకోకుండా తప్పు కప్పేస్తున్న ఎక్సయిజ్ శాఖ

Satyam NEWS

మైనింగ్ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు

Bhavani

ప్రజలకు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి పాత్ర కీలకం

Satyam NEWS

Leave a Comment