29.7 C
Hyderabad
May 6, 2024 04: 18 AM
Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: కటకటాల్లోకి విలేకరి, అతని స్నేహితులు

arrest

కరోనాకు సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు ఒక విలేకరి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు లో చోటుచేసుకొంది.

వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కొర్విచెడ్ కు చెందిన విజయకుమార్ కొడంగల్ ప్రాంతానికి ఓ మహిళ (60) కరోనా లక్షణాల తో తాండూరు లోని జిల్లా ఆసుపత్రి చేరిందని ఓ ఫోటో తో పాటు వివరాలు అదే గ్రామానికి చెందిన ఒక విలేకరి ఏర్పాటు చేసిన గ్రూపులో పోస్ట్ చేశాడు.

అంతే కాకుండా వికారాబాద్ జిల్లా లోనే మొదటి కరోనా కేసు అని అధికారులు ధృవీకరించకుండానే పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్  జిల్లా వ్యాప్తంగా  విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఉలిక్కిపడ్డ జిల్లా అధికారయంత్రాంగం తాండూరు ఆసుపత్రి సూపరిండెంట్ ను సదరు పోస్ట్ పై ఆరా తీయగా సాధారణ సమస్యతో వచ్చిన మహిళకు కరోనా లక్షణాలు లేవని, అయినా కూడా సదరు మహిళా రక్తం తదితర శాంపిళ్లు గాంధీ ఆసుపత్రికి పంపించామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

దీంతో తప్పడు వార్త వైరల్ చేసిన విజయకుమార్ తో పాటు గ్రూప్ అడ్మిన్ బాల్ రాజ్ (V5, తాండూరు విలేకరి) లపై  బషీరాబాద్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసి ఇరువురిని రిమాండుకు తరలించారు.

Related posts

అక్షర మాల

Satyam NEWS

ఎస్సైగా కొడుకు.. అంతులేని ఆనందంలో పేరెంట్స్

Satyam NEWS

శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిలి సై

Bhavani

Leave a Comment