38.2 C
Hyderabad
May 5, 2024 21: 43 PM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా అభివృద్ధిని వివరించిన కలెక్టర్ సూర్య కుమారి

#vijayanagarm

శ‌క‌టాల‌లో దిశ పోలీస్ విభాగానికి మొద‌టి బ‌హుమ‌తి, ట్రాఫిక్ కు మూడో బ‌హుమ‌తి

విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి జాతీయ జండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జిల్లా అభివృద్ధి, ప్రగతి పై సందేశం అందించారు. జిల్లా అభివృద్ధి, ప్రగతిని చాటుతూ సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది.  పలు శాఖలు తమ ప్రగతిని వివరిస్తూ వేసిన హోర్డింగ్ లు మైదానం లో ఒరత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

ఈ సందర్బంగా చిన్నారులు  దేశభక్తి గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల కర తాళ ధ్వనులనందు కున్నాయి. కె.జిబి.వి గంట్యాడ, డేంకాడ, రామవరం జెడ్ పి హెచ్, సాలూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పలు దేశ భక్తి గీతలకు నృత్యం చేశారు.

ద్వారాకమయి అంధుల పాఠశాల విద్యార్థులు  కుచ్ కరియే -చెక్ దే ఇండియా నృత్యం ఆకట్టుకుంది. ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు జిల్లా కలెక్టరు  చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్,   ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ,ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, బడ్దు కొండ అప్పల నాయుడు  డి.సి.ఎం.ఎస్ చైర్మన్ అవనాపు భావన,   సంయుక్త కలెక్టర్లు  డా.జి.సి కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, మయూర్ అశోక్, , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కాగా సాంస్కృతిక కార్యక్రమాలలో మొదటి బహుమతి ద్వారకామయి అంధుల పాఠశాల, రెండవ బహుమతి కేజీబీవీ గంట్యాడ. మూడవ బహుమతి ఏ.పి. ఎస్ డెంకాడల‌కు ల‌భించగా…మార్స్ ఫాస్ట్ లో మొదటి బహుమతి దిశ పోలీస్ స్టేషన్, రెండవ బహుమతి స్పెషల్ టాస్క్ ఫోర్స్,మూడవ బహుమతి ట్రాఫిక్ పోలీస్ విభాగానికి లభించింది.

Related posts

చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయూత

Satyam NEWS

క్రిటిసిజమ్: నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ

Satyam NEWS

ఎవరు హామీ ఇస్తే వారికే మా మద్దతు

Satyam NEWS

Leave a Comment