23.2 C
Hyderabad
May 7, 2024 23: 49 PM
Slider చిత్తూరు

తిరుపతి లో లాక్ డౌన్ విధానంపై వ్యాపారుల నిరసన

#Tirupati Town 1

రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిలో కొత్త లాక్ డౌన్ విధానంపై తిరుపతిలోని వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తలాతోకలేని విధానాలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త లాక్ డౌన్ విధానం ప్రకారం తిరుపతిలో 20 పాజిటీవ్ కేసులు ఉన్న డివిజన్‌లలో సంపూర్ణ లాక్ డౌన్ ఉంటుంది.

కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రాంతాలు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది. తిరుపతిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తిరుపతిలో మొత్తం 50 డివిజన్లు ఉంటే అందులో 10 డివిజన్లలో 20కి పైగా కేసులు నమోదు కావడంతో ఆ 10 డివిజన్లు పూర్తిగా లాక్ డౌన్ చేశారు.

ఒక వీధిలో షాపులు తెరిచి, మరో వీధిలో షాపులు మూసివేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పక్కన వాళ్లు వ్యాపారం చేసుకుంటుంటే తాము షాపులు మూసి కూర్చోవాల్సి వస్తున్నదని వారు అంటున్నారు.

Related posts

టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

Satyam NEWS

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

Satyam NEWS

కరోనా మృతుడి అంత్యక్రియలు చేసిన జర్నలిస్టులు

Satyam NEWS

Leave a Comment