29.7 C
Hyderabad
May 1, 2024 07: 27 AM
Slider ఖమ్మం

మద్యం దుకాణాల రిజర్వేషన్ ఖరారు

#liquor stores

2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ లను లక్కీ డ్రా ద్వారా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. ఖరారు చేశారు. డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారులు, ఎస్సి, ఎస్టీ, బిసి సంక్షేమ త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ లక్కీ డ్రా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలిపారు.

ఇందులో గౌడ కులానికి 18 (15 శాతం), ఎస్సీలకు 14 (10 శాతం), ఎస్టీ లకు 8 (5 శాతం) మద్యం దుకాణాల్లో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 6 దుకాణాలు పోనూ మిగతా 2 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు. 70 శాతం అనగా 82 మద్యం దుకాణాలు జనరల్ కు కేటాయించామని ఆయన తెలిపారు.

లక్కీ డ్రా ద్వారా గౌడ కులస్తులకు 4, 116, 101, 18, 66, 2, 77, 94, 17, 62, 110, 41, 109, 114, 67, 92, 7, 1 నెంబర్ దుకాణాలు, ఎస్సిలకు 25, 34, 49, 71, 24, 97, 13, 82, 87, 78, 99, 26, 111, 86 నెంబర్ దుకాణాలు, ఎస్టీ లకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 6 దుకాణాలు 117, 118, 119, 120, 121, 122 నెంబర్ వి రిజర్వ్ ఉండగా, గురువారం లక్కీ డ్రా ద్వారా 12, 21 నెంబర్ దుకాణాలు కేటాయింపబడ్డాయని ఆయన అన్నారు. నేడు (శుక్రవారం) నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరిస్తామని ఈ నెల 18 సాయంత్రం 6.00 గంటల వరకు అన్ని పనిదినాలలో దరఖాస్తులను స్వీకరణ చేపడతామని కలెక్టర్ తెలిపారు.

Related posts

క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి

Bhavani

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

Satyam NEWS

దళిత మహిళపై దాడి.. మరో నలుగురి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment