25.7 C
Hyderabad
May 9, 2024 07: 36 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

#revanthreddy

ఎమ్మెల్యేల కొనుగోలుపై ఈడి, సిబిఐకి లేఖ రాయాలన్న రేవంత్

కామారెడ్డిలో నిన్న సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కొనుగోళ్లపై ఈడి, సిబిఐ విచారణకు లేఖ రాయాలని, తన సవాల్ కు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిసి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బిసి డిక్లరేషన్ ను సభలో ప్రవేశపెట్టారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయం మేరకే తాను కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్తిగా ఉన్నానన్నారు. తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, కేసీఆర్ కు చరమగీతం పడటానికి కామారెడ్డి సిద్ధమైందన్నారు. 2015 లో కామారెడ్డికి చెందిన లింబయ్య అనే రైతు తన బాధలను చెప్పుకోవడానికి కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నించి, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంట్ పోల్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. బీరయ్య అనే రైతు వరిదాన్యం కుప్పపై మృతి చెందాడని గుర్తు చేశారు. ఇవాళ తన అమ్మమ్మ ఊరు అని చెప్పుకుని వస్తున్న కేసీఆర్ కు నాడు లింబయ్య, బీరయ్య కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు.

కామారెడ్డి ప్రజల ఓట్లు కావాలని ఇవాళ ఇక్కడ బంగారు తునక చేస్తా అంటున్నాడని, గజ్వేల్ బంగారు తునక అయితే కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఇక్కడికి వస్తున్నారన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ఇక్కడికి వస్తే ఇక్కడి రైతులు ప్రభుత్వానికి ఎదురు తిరిగారని, దాంతో కేటీఆర్ ద్వారా రైతులను పిలిపించి మాస్టర్ ప్లాన్ రద్దు చేశామని ప్రకటించారన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు కాదు కేసీఆర్.. నీ ప్రభుత్వమే రద్దయిందని ధ్వజమెత్తారు. కామారెడ్డికి రావాలని కేసీఆర్ ను గంప గోవర్ధన్ పిలిచాడని దొంగ డ్రామాలు ఆడుతున్నారని, కొడుకు, అల్లుడి నియోజకవర్గాలు వదిలి తన సీటు గుంజుకున్నారని గోవర్ధన్ ఏడుస్తున్నాడన్నారు. గంప గోవర్ధన్ ను గంప కింద కమ్మినట్టు కామారెడ్డి ప్రజలను కమ్ముదామని అనుకుంటున్నవా అని ప్రశ్నించారు.

రెండుసార్లు సీఎం చేస్తే లక్ష కోట్లు సంపాదించుకున్నావ్.. కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నావ్.. నీ కొడుకు జనవాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు.. పరీక్షలు రద్దు చేశావ్.. నిరుద్యోగుల పొట్ట కొట్టావ్..

ఇంకా మూడోసారి సీఎం అవ్వాలని8 చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. మనవడిని మంత్రిని చేయడానికే మూడవసారి సీఎం పదవని తెలిపారు. కేసీఆర్ ను బండకేసి కోట్టాలని కామారెడ్డిలో పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశిస్తే ఇక్కడికి వచ్చానని, పదవుల కోసం తాను ఎన్నడూ అమ్ముడు పోలేదన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే మీకు కనపడడు, వినపడడు.. నేను, షబ్బీర్ అలీ ఇక్కడే ఉంటామని తెలిపారు. దేశం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందని, కామారెడ్డి ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇవ్వాలని కోరారు. డిసెంబర్ 9 న ఉదయం 10:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేయబోతోందని, ఆ సభకు కూడా ఇంతే పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

హిందువుల ధర్మానికి చిహ్నం అయోధ్య రామమందిరం

Satyam NEWS

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలకు రేపటి వరకూ గడువు

Satyam NEWS

రోడ్డు వెడల్పు లో ప్రజా ప్రతినిధుల కుమ్మక్కు రాజకీయాలు

Bhavani

Leave a Comment