29.7 C
Hyderabad
May 7, 2024 05: 05 AM
Slider ప్రత్యేకం

గులాబ్ తుపాన్: రెవిన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అప్రమత్తం

#policealert

గులాబ్  తుపాను..యావ‌త్ ఉత్త‌రాంద్ర‌నే అత‌లాకుత‌లం చేసింది.గ‌త రెండు రోజుల  నుంచీ ఆ తుపానుప్ర‌భావంతో జిల్లా వ్యాప్తంగాఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలుప‌డుతున్నాయి. భారీ ఈదురు గాలుల‌తో  ప‌లు చెట్లు నేల‌కొరిగాయి. దీంతో క‌లెక్ట‌రేట్ లో  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో  డీఆర్ఓ గ‌ణ‌ప‌తిరావు ఎప్ప‌టిక‌ప్పుడు తుపాను ప్ర‌భావం,త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల‌పై స‌మీక్ష‌లు చేస్తున్నారు.ఈ పరిస్థితుల‌లో రెవిన్యూ శాఖ‌తో పాటు  పోలీసులు..స‌హాయ చ‌ర్య‌ల నిమిత్తం రంగంలోకి దిగారు.ఎస్పీ దీపికా  ఎం  పాటిల్ ఆదేశాల‌తో…మూడు డివిజ‌న్ ప‌రిధిల‌లో నాలుగు స‌ర్కిల్ లో ఉన్న ఎస్.హెచ్ ఓలు  లోత‌ట్టు ప్రాంతాల‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైనారు. 

విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్  సూచ‌న‌ల‌తో పూససాటిరేగ ఎస్ఐజ‌యంతి,పార్వ‌తీపురం డీఎస్పీ సుభాష్ సూచ‌న‌లతో ఎల్విన్ పేట సీఐ  తిరుప‌తి రావు…లోత‌ట్టు ప్రాంతాల‌ను న‌దులు ప్ర‌వ‌హించి ప్రాంతాల‌లోఉండీ..స్థానిక ప్ర‌జ‌ల‌ను అక్క‌డ నుంచీ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

Related posts

ఈవిఎం గోడౌన్ తనిఖీ

Bhavani

వజ్రోత్సవం నిర్వహించే హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉంది

Satyam NEWS

ఇంటింటికి భగీరథ నీళ్లపై అశ్రద్ధ వద్దు

Satyam NEWS

Leave a Comment