40.2 C
Hyderabad
May 5, 2024 18: 51 PM
Slider శ్రీకాకుళం

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు

#ministerdharmana

శ్రీకాకుళం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శ్రీకాకుళం పెద్దపాడు లోని తన క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. వంశధార  ప్రాజెక్టులపై ముఖ్యంగా మంత్రి సమీక్షించారు.

అవకాశం వచ్చినప్పుడు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరిగిందని, అందుకు ఇంజనీర్స్ తోడ్పాటు సంవృద్ధిగా లభించిందని తెలిపారు. జిల్లాలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నీరు ఉపయోగించు కుంటే రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు తీసిపోని వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో  200కి.మీ మేర సముద్ర తీరం ఉంది, దానిని అభివృద్ధి చేయాల్సిఉందని అన్నారు.

గత ప్రభుత్వాలు విస్మరించారని ఆవేదన చెందారు. వంశధార ప్రోజెక్టు కోసం ఇప్పటి వరకు సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చుచేయడం జరిగిందని వివరించారు. ఒరిస్సాతో వివాదాల నెలకొన్న నేపథ్యంలో హిరమండలం రిజర్వాయర్ ను రూ.300 కోట్లు వ్యయంతో లిఫ్ట్ ఏర్పాటు చేస్తే 19.5 టీఎంసీల నీటిని  నింపగలమని తెలిపారు.

వంశధార ప్రాజెక్ట్ కు 2000 కోట్లు ఖ ర్చుచేయడం జరిగిందని అన్నారు. 19.5 టి ఎంసీ ల నీరు నింపడానికి నేరడీ వద్ద బేరెజ్ కట్టాల్సి ఉందని అన్నారు. అందుకే ఈలోగా గొట్టా దగ్గర  లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్ని నింపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ని కోరగా ఆయన మౌఖికంగా ఆమోదించినట్లు తెలిపారు. 

సీఎంకు ఈ విషయం చెబితే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఎన్నికలకు వెళదాం అన్నారని తెలిపారు. వంశధార పూర్తి చేసి మండు వేసవిలో చల్లని నీరు అందించడమే తన లక్ష్యం అని స్పష్టం చేసారు. అదే కనుక జరిగితే ఒక నెల ముందే వరి నాట్లు వేసుకోవచ్చని, దాని వలన తూఫానుల నుండి తప్పించుకొని పంట సకాలంలో రైతులకు అందుతుందని చెప్పారు.

రిజర్వాయర్ లో నీరు ఉంటే వర్షాలు లేకపోయిన సకాలంలో రైతులకు నీరు అందించగలమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం వాడిగా ఇక్కడ హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం లో రాజ్యాంగానికి విరుద్ధంగా కొంతమంది పదోన్నతులు పొందారని వాటి సరి చేయాలని వంశధార ఎస్ఈ డోల తిరుమల రావు వివరించారు,

రాజ్యాంగ విరుద్ధంగా పదోన్నతులు పొందినవారి పై సమీక్షిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వంశధార ఎస్ఈ తిరుమలరావు, బొబ్బిలి ఎస్. ఈ బొబ్బిలి ఎన్ రాంబాబు, ఎస్ఈ శ్రీకాకుళం సుధాకర్, డిప్యూటీ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ మన్మధరవు, డిప్యూటీ ఈఈ స్వర్ణకుమార్,  ఈఈ నర్సన్నపేట ప్రదీప్ కుమార్, ఈఈ శ్రీకాంత్, డీఈ గోపాల్ కృష్ణ, డిఈ కృష్ణారావు, డిఈ లావణ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులు

Satyam NEWS

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి

Satyam NEWS

1360 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Bhavani

Leave a Comment