30.7 C
Hyderabad
April 29, 2024 05: 21 AM
Slider రంగారెడ్డి

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి

#uppalmla

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు 56.50లక్షలతో కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను బుధవారం ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, కొత్త రామారావు, నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఈసీఐఎల్ కార్మిక సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తదితరు లతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో సిసి రోడ్లు, గార్డెనింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కో కో,  వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఇతర అవసరాల కోసం ఉపయోగించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పాఠశాల కు ఎదురుగా ఉన్న భవనాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం కోసం  హాల్ ను తయారు చేయాలని సూచించారు.

ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యా బోధన జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించడం జరుగుతుందని అన్నారు.

ఈసీఐఎల్ కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో పాఠశాల భవనానికి రంగులు సఫాయి కార్మికుల ఏర్పాటు విషయాన్ని కంపెనీ సీఎం డి సంజయ్ చౌబే దృష్టికి తీసుకెళ్లాలని కార్మిక సంఘం నాయకుడు భాస్కర్ రెడ్డితో వివరించారు. ప్రభుత్వ పాఠశాల స్వాగత ద్వారం ఆకర్షణీయంగా ఉండేలా నిర్మాణం పనులు కొనసాగించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను, అధికారులను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేష్ రెడ్డి, శ్రీశైలం, చర్లపల్లి కాలనీల సమాఖ్య సి సి ఎస్ ప్రతినిధులు నాయకులు ఎంపల్లి పద్మారెడ్డి, గరిక సుధాకర్, గడ్డం రవి కుమార్, కాటేపల్లి రవీందర్ రెడ్డి, కిరణ్,గంప కృష్ణ, వినోద్, ఉపేందర్, వెంకటేష్, చంద్రమౌళి, నరసింహ, కరీం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

నిదర మత్తులో ఎక్సైజు: మద్యం మత్తులో గ్రామాలు

Satyam NEWS

సీక్రెట్: రేవ్ పార్టీలో అమ్మాయిలు నెల్లూరు వారు

Satyam NEWS

జడ్జిమెంట్: హంగ్ మునిసిపాలిటీలన్నీ గులాబి కే

Satyam NEWS

Leave a Comment