26.7 C
Hyderabad
May 3, 2024 09: 01 AM
Slider నల్గొండ

రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ ఐ

#ACBTrap

నల్గొండ జిల్లాలోని  పెద్ద అడిశర్ల పల్లి తహసీల్దార్  కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంతుండగా రెవిన్యూ  ఇన్సెపెక్టర్(ఆర్ఐ) శ్యామ్ నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

భీమనపల్లి గ్రామానికి చెందిన  వెంకట్ రెడ్డి  అనే రైతు  తన 17 గుంటల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని తహసీల్దార్ కు అర్జీ పెట్టుకున్నాడు.

విచారణ చేపట్టి  మ్యుటేషన్ చేయాలని  రెవెన్యూ ఇన్సెపెక్టర్ శ్యామ్ నాయక్ ను  ఎమ్మార్వో ఆదేశించారు.  ఈ పని చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని  రెవెన్యూ ఇన్సెపెక్టర్ రైతు  వెంకటరెడ్డి ని  డిమాండ్ చేసాడు.

దీంతో, రైతు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు ను ఆశ్రయించాడు. శుక్రవారం  సాయంత్రం తహశీల్దార్  కార్యాలయంలో రైతు నుంచి ఆర్ఐ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణా వలపన్ని పట్టుకున్నారు.

పంచనామా నిర్వహించిన అధికారులు శ్యాం నాయక్ ను శనివారం హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

Related posts

దళితులను ఏకం చేస్తా…పార్టీని పటిష్టం చేస్తా

Satyam NEWS

చెరువు మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Bhavani

పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యేపై పార్టీనేతల తిరుగుబాటు

Satyam NEWS

Leave a Comment