33.7 C
Hyderabad
April 29, 2024 01: 21 AM
Slider పశ్చిమగోదావరి

చెరువు మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు

#smuggling

ఏలూరు జిల్లా పెదవేగి మండల కేంద్రం లో కందులవారి కుంట చెరువులో జేసిబి తో రెవిన్యూ, మైనింగ్ అనుమతులు లేకుండా మట్టి తవ్వి ట్రాక్టర్ ల పై తరలిస్తున్న సమాచారం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు జె సి బి తో పాటు ట్రాక్టర్ ను సీజ్ చేశారు. మైనింగ్ నిబంధనల ప్రకారం అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్న జె సి బి కి ట్రాక్టర్ కి కలిపి 15000 రూపాయలు జరిమానా విధించామని పెదవేగి తహసీల్దార్ N .నాగరాజు సోమవారం తెలిపారు.

మండల పరిధిలో కాలువలు, కాలువ గట్లు (పోలవరం )తో సహా ప్రభుత్వ భూములలో ఎటువంటి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడినా గనులు మరియు భూగర్భ శాఖ వారి నియమ నిబంధనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహ సీల్దార్ నాగరాజు హెచ్చరించారు.

Related posts

ఏఓబీ పరిధిలో కొఠియా ప్రజల భద్రతకు భరోసా కల్పించిన ఏపీ పోలీసులు..!

Satyam NEWS

అసమ్మతికి ఆజ్యం: వనపర్తిలో జూపల్లి సమాలోచనలు

Satyam NEWS

ముద్దులొలికే చిన్నారితో సహా దంపతుల అనుమానాస్పద మృతి

Satyam NEWS

Leave a Comment