28.7 C
Hyderabad
May 6, 2024 08: 24 AM
Slider నల్గొండ

గ్రామీణ వైద్యులకు శాస్త్రీయమైన శిక్షణ ఇవ్వాలి

#rmp

ఆర్ఎంపి,పిఎంపి,వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్  శిక్షణను పునః ప్రారంభించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రమాశంకర్ సంఘ సభ్యులకు ఐడి,ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారామెడిమెడికల్ శిక్షణకై జూన్ 2015లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 428 కు సవరణలు చేసి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో శిక్షణను ప్రారంభించాలని,తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తన్నీరు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ జీవో రాష్ట్రంలోని ఆర్ఎంపి,పిఎంపి లకు ఉనికికి వృత్తికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవో 429 సిలబస్ ద్వారానే శిక్షణను ఇవ్వాలని తద్వారా తెలంగాణ లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన,శాస్త్రీయమైన ప్రాథమిక వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలోని పద్మశాలీ కల్యాణ మండపంలో హుజూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ అధ్యక్షతన జరిగిన హుజూర్‌నగర్ మండల  రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్  సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

కరోనా కష్టకాలంలో గ్రామీణ వైద్యులు ప్రాణాలకు తెగించి ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు కరోనా వ్యాధి ప్రబలకుండా,వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం పట్ల అవగాహనను కల్పించి అనేకమందిని చైతన్య వంతులను చేశారని,కరోనా మహమ్మారికి ఎంతోమంది గ్రామీణ వైద్యులు బలైన విషయం గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,అయినా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉన్న ఈ సందర్భంలో రాష్ట్రంలోని 52 వేల పైచిలుకు ఉన్న గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారి సేవలను మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు, ఏజెన్సీ ఏరియాలలో,తండాల లోని   ప్రజలకు అందించవచ్చని,తద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మాణం సులభ సాధ్యమని ఆయన అన్నారు.అంతకుముందు  తెలంగాణ రాష్ట్రంలో కరొనా బారిన పడి మరణించిన ఆర్ఎంపి,పిఎంపి ల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ప్రశాంతి హాస్పటల్ ఖమ్మం డాక్టర్లు జీవన్ కుమార్,మధు,నరేష్ ,కల్యాణ్ సీజన్ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి అధునాతన వైద్య సదుపాయాల గురించి,అధునాతన శస్త్ర చికిత్సల గురించి  వివరించి ఆర్ఎంపి,పిఎంపి లు అడిగిన పలు సందేహాలను తీర్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.రమాశంకర్,హుజూర్ నగర్ మండల ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు,చింతలపాలెం,మఠంపల్లి, నేరేడుచర్ల ,పాలకీడు మండలాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు సిహెచ్ వెంకటేశ్వర్లు,షేక్ షంషుద్దీన్,ఉపేందర్  ప్రసాద్,పిచ్చయ్య,నాగయ్య,సైదులు,  జానయ్య,పి.బ్రహ్మం,ఎంఆదినారాయణ, షేక్ అమీనా,కొండా శ్రీనివాస్,పూల రాజు, కోటేశ్వర్రావు,రాంబాబు,మర్రెడ్డి, పురుషోత్తం,కొండలు,రమేష్ ,అంజయ్య, గురవయ్య,గమాన్యయేల్,వెంకటేశ్వర్లు,చాంద్ మియా,శ్రీనివాస్,ప్రకాష్,వెంకన్న, శ్రీధర్,మండలంలోని 11 గ్రామ  పంచాయితీలతో పాటు,పట్టణం లోని ఆర్ఎంపి,పిఎంపి,గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

Bhavani

ఏనుగు హ‌ల్‌చ‌ల్‌.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Sub Editor

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వై వి సుబ్బారెడ్డి నియామకం

Satyam NEWS

Leave a Comment