38.2 C
Hyderabad
April 28, 2024 19: 05 PM
Slider నిజామాబాద్

కల్వర్టును ఢీకొన్న బైక్ తో మహిళ మృతి

accedent

బిచ్కుంద మండలంలోని గుండె నమిలి గ్రామ సమీపాన మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ గ్రామానికి చెందిన కాశీరాం ఆయన మరదలు మేదరి సాయవ్వ బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి బైక్ పై బాన్సువాడ నుండి బయలుదేరారు.

గుండె నెమలి గ్రామ సమీపాన మూలమలుపు వద్ద బైకు అదుపు తప్పి కల్వర్టు కు ఢీకొనడంతో పక్కనే గల కాలువలో మేదరి సాయవ్వ 45 పడి అక్కడికక్కడే మృతి చెందగా  మేదరి కాశీరాంకు గాయాలయ్యాయి. గమనించిన  స్థానికులు 108 కు సమాచారం అందించి గాయపడిన కాశీరాంను బాన్సువాడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త  ఒక కొడుకు కూతురు ఉన్నారని బంధువులు తెలిపారు.

Related posts

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె

Satyam NEWS

రోడ్ టెర్రర్:గీసుకొండలో ముగ్గురు యువకుల మృతి

Satyam NEWS

Leave a Comment