40.2 C
Hyderabad
May 1, 2024 16: 29 PM
Slider రంగారెడ్డి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు

accedent

రోడ్డు ప్రమాదం లో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన,నారాయణ పేట జిల్లా, కోస్గి మండలం, నాచారం గ్రామం లో చోటు చేసుకుంది. స్థానిక si నాగరాజు తెలిపిన వివరాల మేరకు, వికారాబాద్ జిల్లా, బొంరస్ పేట మండలం, అల్లికాన్ పల్లి గ్రామానికి చెందిన  కావాలి ఎల్లప్ప (52), అయన అల్లుడు దస్తప్ప (30), కోడలు వసంత (26),ఈ ముగ్గురు కల్సి ఒకే బైక్,AP22, AB1570 నంబర్ బైక్ పై,దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామానికి ఉదయం ఇంటి నుండి 7:16నిముషాలు కు బయలు దేరారు.

కోడలు వసంత గత కొద్దీ రోజులుగా కడుపులో నొప్పి తో బాధ పడుతుండగా ఆయుర్వేద వైద్య చికిత్స కై ఈర్లపల్లి వెళుతున్నారు. నాచారం గ్రామం లోని వివేకానంద విగ్రహం దగ్గర, మహారాష్ట్ర నుండి విజయవాడ వెళుతున్న, MH 14GD8913నంబర్ గల ట్రక్కు, ఢీ కొట్టడం తో, కావాలి ఎల్లప్ప ట్రక్కు వెనక టైర్ కింద పడడం తో తల నుజ్జు నుజ్జు అయ్యి అక్కడి కక్కడే మృతి చెందాడు. కోడలు వసంత తలకు బలమైన రక్త గాయాలు కావడం తో హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి కి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతుడి అల్లుడి కుడి కాలు కు బలమైన గాయాలు కాగా అతడి ని కూడా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి కి తరలించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న si నాగరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విచారించ రు.ప్రమాదడానికి కారణమైన,మహారాష్ట్ర లోని  అహమద్నగర్ కు చెందిన,ట్రక్కు డ్రైవర్  రాజేంద్ర చాడే (23), ను అదుపులోకి తీసుకున్నట్లు si తెలిపారు. మృతుడి భార్య కావలి మల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదానికి గురి కావడం తో,కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంట తడి పెట్టించాయి. ఇంటి నుండి బయలు దేరిన, కేవలం 15 నిమిషాల వ్యవధి లోనే వీరు రోడ్డు ప్రమాదానికి గురి కావడం, అందరిని కలచి వేసింది.రోడ్డు ప్రమాదానికి అతి వేగం కారణమని, రోడ్డు భద్రత నియమాలు పాటించక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు si తెలుపుతూ,కుటుంబాలు రోడ్డు న పడకుండా,రోడ్డు భద్రత నియమాలు విధిగా అందరూ పాటించాలని ఆయన కోరారు.

Related posts

అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కుపై ‘సుప్రీం’ చారిత్రాత్మక నిర్ణయం

Satyam NEWS

ఘనంగా మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి

Satyam NEWS

దిశ పీఎస్ లో లేడీ పోలీసు బాస్…ఆకస్మిక తనిఖీలు…!

Satyam NEWS

Leave a Comment