31.7 C
Hyderabad
May 2, 2024 07: 15 AM
Slider నిజామాబాద్

జాతీయ రహదారి పక్క గ్రామాల రాకపోకలను పునరుద్ధరించాలి

#KamareddyCollector

జాతీయ రహదారి 161 పక్కన గల 12 గ్రామాలకు మెటల్ రోడ్డు  ను హైవే అధికారులు వేస్తామని అంగీకరించారని జిల్లా కలెక్టర్  డాక్టర్ఎ. శరత్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో నేషనల్ హైవే, అటవీశాఖ, దేవాదాయ శాఖ అధికారులతో  నేషనల్ హైవే పనులపై సమీక్ష నిర్వహించారు.

నేషనల్ హైవే, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనులు పూర్తిచేయాలని సూచించారు. బిచ్కుంద మండలం పతాలాపూర్లో జాతీయ రహదారి లో నివాస గృహాలను కోల్పోయిన 38 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

కందర్ పల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ముందుభాగం జాతీయ రహదారి కి వెళ్తున్నందున వచ్చిన పరిహారాన్ని ఆర్ డి ఓ, తహసిల్దార్ పేరిట జమ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్ డి ఓ రాజా గౌడ్, నేషనల్ హైవే పి డి అనురాధ, డిఎఫ్వో సునీల్ కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య, సూపరిండెంట్ వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS

కోట్పా చట్టంపై అవగాహన అవసరం

Sub Editor

మసీదు,ఈద్గాలకు మౌలిక వసతులు కల్పించండి

Satyam NEWS

Leave a Comment