37.2 C
Hyderabad
May 1, 2024 13: 24 PM
Slider నిజామాబాద్

ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో

#bhikkanoor

ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ బిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను హెచ్చరించారు. నిన్న బస్వాపూర్ గ్రామంలో షబ్బీర్ ఆలీపై గంప గోవర్ధన్ చేసిన విమర్శలపై కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీంరెడ్డి, పిసిసి సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖబర్దార్ గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో.. మా నాయకునిపై అవాకులు చవాకులు పేలితే పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. మా నాయకుడు షబ్బీర్ అలీని విమర్శిస్తే ఆకాశంపై ఉమ్మినట్టేనన్నారు. షబ్బీర్ అలీ కుటుంబంపై కాదు దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు. నీసొంత గ్రామం బస్వాపూర్ లో ప్రభుత్వం చేత స్థలాన్ని కొని 220 ఇళ్ల స్థలాలు పేదలకు ఇచ్చిన ఘనత షబ్బీర్ అలీదని, అలాగే మండలంలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేదలకు పంచారన్నారు.

నీ హయాంలో బిక్కనూరు మండలంలో 200 ఇండ్లు కూడా నిర్మించలేకపోయావని విమర్శించారు. కామారెడ్డిలోని జన్మభూమి రోడ్డును 80 ఫీట్ల రోడ్డు నుండి 60 ఫీట్ల రోడ్డు చేసావ్.. అదే బిక్కనూరు పట్టణంలో భారీ వాహనాల కోసం పక్క నుంచే బైపాస్ రోడ్ వెళ్లినా పట్టణంలో 100 ఫీట్ రోడ్డును 110 ఫీట్ చేసి వందల కుటుంబాలను రోడ్డుపాలు చేసి ఎంతోమంది చిరు వ్యాపారుల పొట్ట కొట్టిన ఘనత నీది అని, ఆ కుటుంబాల ఉసురు నీకు తగులుతుందన్నారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దూర దృష్టితో 30 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే కార్యక్రమం షబ్బీర్ అలీ చేపట్టారని, ప్రస్తుతం ఎలక్ట్రిక్ పోల్ కూడా రైతులకు అందించలేరని, రైతులకు ఒక పోల్ అవసరం ఉంటే రైతే పైసలు పెట్టి కొనాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

భిక్కనూరు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల కొరకు స్థలాన్ని యజమానితో మాట్లాడి 10 ఎకరాలు విరాళంగా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు లేకుంటే తన సొంత డబ్బులతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించి కళాశాల మంజూరు చేయించిన నిర్మించిన ఘనత షబ్బీర్ అలీదన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ కోసం 12 ఎకరాల స్థలాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వంతో స్థలాన్ని కొనిచ్చి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన ఘనత షబ్బీర్ అలీదే అన్నారు.

షబ్బీర్ అలీ మంత్రిగా చేసిన సమయంలో ప్రతి మారుమూల గ్రామానికి బీటీ రోడ్డు వేయించారని, ఆ రోడ్లకు డాంబర్ వేసి వెడల్పు చేసి కమిషన్లు పొందావు తప్ప వేరే అభివృద్ధి ఏం చేయలేదన్నారు. షబ్బీర్ అలీ ఏ రోజు కూడా కులమతాల గురించి ఆలోచించలేదని, ఒక ముస్లిం అయి ఉండి నియోజకవర్గంలో వందలాది గుళ్ళు నిర్మించారని, కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి పట్టు వస్త్రాలు తలంభ్రాలు సమర్పించారన్నారు. నువ్వు ఏ రోజైనా సతీ సమేతంగా ఏ గుడికి అయినా నువ్వు వెళ్ళావా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో 115 సార్లు షబ్బీర్ అలీ మాట్లాడారని,  స్పీకర్, గవర్నర్లకు ధన్యవాదాలు తప్ప వేరే విషయం ఇప్పటివరకు గంప గోవర్ధన్ మాట్లాడలేదన్నారు. గంప గోవర్ధన్ ఓటమి భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఎన్నికల సమయం రాగానే షబ్బీర్ అలీ ముస్లిం అని, అవినీతిపరుడని అంటున్నావని విమర్శించారు. 9 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నారు కదా.. షబ్బీర్ అలీపై విచారణ జరిపించి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. షబ్బీర్ అలీ మచ్చలేని నాయకుడు కాబట్టి ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

గడిచిన ఎన్నికల్లో నైతికంగా ఎన్నికల్లో షబ్బీర్ అలీదే విజయమని, నీవు, నీ అనుచరులు ఎదురుగా ఢీకొనలేక పత్రికల్లో తప్పుడు యాడ్లు ఇచ్చి దొడ్డిదారిన గెలిచిన  ఎమ్మెల్యేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు లింగారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు లింబాద్రి, బిక్కనూర్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, యువజన కాంగ్రెస్ నాయకులు జీవన్, ఎన్ఎస్యూఐ నాయకులు అశోక్, బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

హై కోర్ట్ ఆర్డర్ :కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు లైన్‌క్లియర్‌

Satyam NEWS

ఘనంగా కొండా యువసేన జిల్లా అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

Satyam NEWS

ముస్లింల ఉసురు పోసుకోవద్దు జగన్ రెడ్డి గారూ

Satyam NEWS

Leave a Comment