38.2 C
Hyderabad
May 5, 2024 20: 55 PM
Slider ప్రత్యేకం

రహదారుల నిర్మాణ నిధులు విడుదల చేయాలి

#nama nageswararao

తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ రోడ్డు ఇప్లాస్టక్చర్ ఫండ్ ( సీఆర్ఎఎఫ్ ) నిధులతో చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత నామ నాగేశ్వరరావు కోరారు.

టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లోక్ సభ , రాజ్యసభ ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రాన్ని అందించారు. 2021 సంవత్సరానికి రాష్ట్రానికి రావాల్సిన సీఆర్ఎఫ్ నిధులు రూ. 620 కోట్లను విడుదల చేయాలని కోరారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత 3,306 కి.మీ రోడ్లను రాష్ట్ర రహదారులుగా గుర్తించగా అందులో ఇప్పటి వరకు 2,168 కి.మీ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించారని తెలిపారు. మిగిలిన 1,138 కి.మీ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరారు. జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్ర టూరిజం అభివృద్ధితోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానం చేయడంతో పాటు ఆయా రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చెందుతాయిని లేఖలో తెలిపారు.

చౌటుప్పల్ – ఆమనగల్ – షాద్ నగర్ – కంది -186 కి.మీ, కరీంనగర్ – సిరిసిల్ల – కామారెడ్డి – ఎల్లారెడ్డి – పిట్లం -165 కి.మీ, కొత్తకోట గూడురు – మంత్రాలయం -70 కి.మీ, జహీరాబాద్ – బీదర్ – డెగ్లూర్ -25 కి.మీ కలిపి మొత్తం 446 కి.మీ రహదారులను జాతీయ హోదా కల్పించాలని కోరారు.

ఎన్ హెచ్ 167 లో అలీనగర్ రోడ్డు నిర్మాణానికి రూ.220 కోట్లను మంజూరి చేసిందని దానికి బదులు మిర్యాలగూడలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చితే తక్కువ నిధులతో నిర్మాణం అవుతుందని కాలపరిమితి, నిధుల భారం తగ్గుతుందని వివరించారు. నాలుగు లైన్ల రోడ్డును మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు ప్రతిపాదించారని తెలిపారు.

రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి , జాతీయ రహదారుల గుర్తింపుకు చొరవ చూపాలని వినతిపతంలో టీఆర్ఎస్ పక్షనేత నామ పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ చుట్టూ నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్ ) కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీల బృందం శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

నితిన్ గడ్కరీని కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు పోతుగంటి రాములు, బండా ప్రకాష్, మాలోతు కవిత, పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, గడ్డం రంజిత్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు.

Related posts

అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు

Satyam NEWS

టి‌డి‌పి గడియారాలు వచ్చేస్తున్నాయ్

Murali Krishna

ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం

Bhavani

Leave a Comment