33.7 C
Hyderabad
April 29, 2024 02: 05 AM
Slider నల్గొండ

ఉత్తమ్ ప్రతిపాదనతో గ్రామీణ సడక్ యోజన రోడ్లు

#Uttamkumarreddy

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 76 కిలోమీటర్ల రోడ్లు మంజూరయ్యాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంటు సభ్యుడుగా తన సిఫార్సుల మేరకు విడుదల అయిన ఈ రోడ్డు పనులను మొత్తం 41 కోట్ల రూపాయల ఖర్చుతో చేపడతామని ఆయన తెలిపారు.

గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను ప్రతిపాదన పంపగానే కేంద్రం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. మంజూరైన రోడ్లలో వింజమూరు గేట్ నుంచి  రెయిన్ గూడా రోడ్డు, మెట్టుగూడెం నుంచి లక్ష్మీపురం రోడ్డు, కందుకూరు నుంచి దిండి రోడ్డు, అగమోత్కూరు నుంచి భీమనపల్లి రోడ్డు,

కల్వపల్లి బ్రిడ్జి నుంచి గూడూరు (నార్కట్ పల్లి అద్దంకి హైవే వయా అవంతిపురం) రోడ్డు, వేములపల్లి ఎన్ ఎస్ పి క్యాంప్ నుంచి తిమ్మారెడ్డి గూడెం రోడ్డు, దాచారం ఐపూర్ నుంచి మక్తా కొత్తగూడెం మీదుగా కూడలి వరకూ, కీతవారిగూడెం ఫంక్షన్ హాల్ నుంచి కొత్తగూడెం మీదుగా రంగాపురం రోడ్డు,

శిరికొండ నుంచి మేకలపాటి తండా మీదుగా బుర్కచర్ల రోడ్డు,  కందులవారి గూడెం నుంచి దిర్శినచర్ల మీదుగా రాళ్లవారిగూడెం రోడ్డు, పెన్ పహాడ్ నుంచి అనంతారం నుంచి దేశ్పహాడ్ నుంచి దుబ్బగూడెం రోడ్డు, ఎండ్లపల్లి నుంచి రేక్యాతండా రోడ్డు వీటిలో ఉన్నాయి.

Related posts

(2022) How Does Benicar Lower Blood Pressure 10 Home Remedies For High Blood Pressure

Bhavani

ప్రధాని మోడీ విశాఖ టూర్… పోలీసు దిగ్బంధంలో విశాఖ మహానగరం…!

Bhavani

ఓ గాడ్: ఎంత హృదయవిదారక సంఘటన ఇది?

Satyam NEWS

Leave a Comment