29.7 C
Hyderabad
May 3, 2024 06: 37 AM
Slider కరీంనగర్

మట్టిరోడ్డు లేకుండా చేస్తా: మంత్రి గంగుల కమలాకర్

#gangula

కరీంనగర్ నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్లు అద్భుతంగా నిర్మించామని తెలిపారు. మిగిలి పోయిన రోడ్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా 406, 407 జీవోల కింద పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల నుండి మొత్తం 75 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అందులో 59 కోట్ల 30 లక్షలతో కొత్తపల్లి, రూరల్ మండలాలకు సంబంధించి ఆరు కొత్త రోడ్లు, వరదల వల్ల దెబ్బతిన 10 రోడ్ల బాగు చేస్తామన్నారు. 14 కోట్ల 78 లక్షలతో 8 ఆర్ అండ్ బి రోడ్లను రెన్యూవల్ చేస్తామన్నారు. సీఎం కేసీఅర్ అదేశాల మేరకు వాటి పనులను డిసెంబర్ లో ప్రారంభించి మార్చ్ 31లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టణంలో డ్యామేజ్ అయిన రోడ్లకు సంబంధించి 40 కోట్ల మేర ప్రతిపాదనలు పంపామని.. రేపు దానికి సంబంధించిన జీవో విడుదల అవుతుందని పేర్కోన్నారు.

Related posts

బిజెపిలో చేరిన కరీంనగర్ టీఆర్ఎస్ నేత

Satyam NEWS

చిన్న తిరుపతిలో వైభవంగా వేంకటేశ్వర కళ్యాణం

Satyam NEWS

నిధుల మంజూరుకు కేటీఆర్ కు కార్పొరేటర్ ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment