సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామరెడ్డి చేసిన ప్రకటన విని తట్టుకోలేకపోయిన ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నేషనల్ మజ్జూర్ యూనియన్ జిల్లా నాయకుడు రవి నాయక్ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నాడు. 52 రోజుల పాటు నిరవధికంగా సమ్మె చేస్తూ ఏమీ సాధించకుండానే సమ్మె విరమించాలని నిర్ణయించడం సబబు కాదని రవి నాయక్ అనుకున్నాడు. సమ్మె పేరుతో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని రవి నాయక్ ఆరోపిస్తున్నాడు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో పెట్రోల్ పోసుకుని రవి నాయక్ ఆత్మహత్యా యత్నం చేశాడు. పోలీసులు అడ్డుకుని అతడిని ఆసుప్రతిలో చేర్చారు.
previous post