మంచిర్యాల పెద్దపెల్లి జిల్లాలో బస్టాండ్, కళాశాల, ప్రధాన కూడళ్లలో అమ్మాయిలను వేధించే వారిపై షీ టీమ్స్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. దాంతో 30 మంది దొరికిపోయారు. రెండు జిల్లాలలో ప్రధానమైన ప్రాంతాలలో మఫ్టీ లో ఉండి షీ టీం బృందాలు మహిళల పట్ల విద్యార్థినిల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న, ప్రవర్తిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లలు చేసినట తప్పులను వివరించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టుబడిన వారిని మందలించి మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించి ఏలాంటి కేసులు నమోదు చేయకుండా తల్లిదండ్రుల అప్పగించారు. వారి ప్రవర్తన మార్చుకోకుండా మహిళల పట్ల, విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అయితే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల గురించి వారి స్నేహాల గురించి గమనిస్తూ ఉండాలని, బయట మహిళలు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం తప్పని వారికి సూచిస్తు ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ సూచించారు. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ సారధ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
previous post