ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తిని గుర్తు పట్టారా. ఆయన ఇటీవలి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితంగా మెలిగిన సిఎం రమేష్. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత సిఎం రమేష్ తెలుగుదేశం పార్టీనీ, చంద్రబాబునాయుడిని నట్టేట్లో వదిలేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరిపోయాడు. బిజెపిలో అమిత్ షాకు అత్యంత నమ్మకస్తుడుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఆయన రాజకీయ జీవితం కాగా వ్యక్తిగత జీవితానికి వస్తే కొడుకు రుత్విక్ కు పెళ్లి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి దుబాయ్ లో అత్యంత ఆర్భాటంగా ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందట. ఎంగేజ్మెంట్ కోసమే 15 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాడు సిఎం రమేష్. వధువు పేరు పూజా. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజా తాళ్లూరి కుమార్తె. రస్ ఆల్ ఖైమా లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రమేష్ తన సతీమణితో కలిసి స్టెప్పులు అదరగొట్టాడు. అదీ కూడా పవన్ కల్యాణ్ పాటకు.
next post