39.2 C
Hyderabad
May 3, 2024 13: 44 PM
Slider జాతీయం

పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌ అకాలీదళ్‌ రచ్చ

పంజాబ్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌, విపక్ష అకాలీదళ్‌ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్‌ సరిహద్దులో బీఎస్ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ సందర్భంగా వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది.

ఓ దశలో పీసీసీ చీఫ్‌ సిద్దూ, అకాలీదళ్‌ ఎమ్మెల్యే బిక్రంసింగ్‌ మంజీత కొట్టుకున్నంత పనిచేశారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వందలాదిమంది మార్షల్స్ ను అసెంబ్లీ మొహరించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు దూసుకెళ్లారు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలు. మీరు దేశద్రోహులు , డ్రగ్స్‌ వ్యాపారం చేస్తారంటు అకాలీదళ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చన్నీ. ఇదే సమయంలో అక్కడికి దూసుకొచ్చిన సిద్దూ.. ఎమ్మెల్యే బిక్రంసింగ్‌ మంజీతను దొంగా అంటూ దూషించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పరస్పర దూషణలు కాస్తా చిచ్చును రాజేశాయి.

Related posts

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Satyam NEWS

జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

Bhavani

మెసేజ్‌తో నిండిన ప్రేమకథల సమాహారం

Satyam NEWS

Leave a Comment